Ind vs Aus T20 Series: నవంబర్ 23 నుంచి ఆసీస్‌తో టీ20 సిరీస్, పూర్తి షెడ్యూల్, టీమ్ వివరాలు ఇవే

Ind vs Aus T20 Series: క్రికెట్ మహా సంగ్రామం ముగిసింది. మరోసారి విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రెండు జట్లు, షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2023, 07:07 AM IST
Ind vs Aus T20 Series: నవంబర్ 23 నుంచి ఆసీస్‌తో టీ20 సిరీస్, పూర్తి షెడ్యూల్, టీమ్ వివరాలు ఇవే

Ind vs Aus T20 Series: క్రికెట్ మెగా టోర్నీ తరువాత ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రపంచకప్ ఆడిన చాలామంది ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినివ్వగా కొత్తగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఆసీస్ సిరీస్ జరగనుంది.

ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఓటమి తరువాత టీమ్ ఇండియాకు మరో ఛాలెంజ్ ఇది. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ, రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్ బాద్యతలు అప్పగించింది బీసీసీఐ. నవంబర్ 23 న ప్రారంభం కానున్న 5 టీ20 మ్యాచ్‌లలో మొదటి మూడింటికి రుతురాత్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ అయితే, నాలుగు, ఐదు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా టీమ్‌లో చేరనున్నాడు. అటు ఆస్ట్రేలియా జట్టుకు మాధ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విశాఖపట్నం, త్రివేండ్రం, గౌహతి, నాగపూర్, హైదరాబాద్‌‌లలో ఈ సిరీస్ జరగనుంది. 

నవంబర్ 23న విశాఖపట్నంలో మొదటి టీ20 మ్యాచ్, నవంబర్ 26న తిరువనంతపురంలో రెండవ టీ20, నవంబర్ 28న గౌహతిలో మూడవ టీ20, డిసెంబర్ 1న నాగపూర్ లో నాలుగవ టీ20, డిసెంబర్ 3న హైదరాబాద్ లో 5వ టీ20 మ్యాచ్ జరగనున్నాయి. 

టీమ్ ఇండియా జట్టు

సూర్య కుమార్ యాదవ్, రుతురాత్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

ఆస్ట్రేలియా జట్టు

మాధ్యువేడ్, మాధ్యూ షార్ట్, టీమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లీష్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా

Also read: Australia: విజయగర్వం తలకెక్కిన ఆస్ట్రేలియా, ట్రోఫీపై కాళ్లు పెట్టి మిచెల్ మార్ష్ పోజులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News