Minister KTR Power Presentation: తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. రెవెన్యూ మండలాలూ, రెవెన్యూ డివిజన్ల సంఖ్య భారీగా పెంచామని.. అతితక్కువ ఉన్న మున్సిపాలిటీలు సంఖ్య కూడా పెరిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 1,24,104 ఉండగా.. ఇప్పుడు 3,17,115 పెరిగిందన్నారు. రాష్ట్రంలో పేదరికం 13.18 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిందన్నారు. పంట దిగుబడి 2014కు ముందు 68 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి కానీ ఇప్పుడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల దాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. ఇంటింటికి మంచినీళ్లు అందించి తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.
"తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. కేసీఆర్ వచ్చినంకనే కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. జీఎస్డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ. పచ్చని పంటలతో తెలంగాణ కళకళలాడుతోంది. తెలంగాణలో పంటల దిగుబడి పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి కోసం రూ. 37 వేల కోట్లు ఖర్చు చేశాం. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
46 వేల చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరించినం. ప్రతి గ్రామంలో చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాం. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశాం.. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది.
సాగుకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. తెలంగాణకు అప్పులు పుట్టకుండా కేంద్రం కుట్ర చేసింది. కాంగ్రెస్‌కు పవర్ ఇస్తే.. ప్రజలకు కరెంట్ ఉండదు. నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేశాం.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణకు అవార్డులు వస్తున్నాయి. పల్లె ప్రగతితో గ్రామ స్వరాజ్యం స్థాపిస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశాం.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు.. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు.. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దు. బ్యారేజీల్లో సమస్యలు కామన్. సాగర్ కట్టిన తరువాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయి. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయి. హరితనిధి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 2 మెడికల్ కాలేజీలు ఉండేవి.. తెలంగాణ వచ్చినంక 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం.." అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook