Bigg Boss Season 7 Telugu Updates: ఉల్టా పల్టా అంటూ ఆడియన్స్‌ను అలరిస్తూ.. సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది బిగ్ బాస్ సీజన్ 7. డిఫరెంట్ టాస్క్‌లతో ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు. షో చివర దశకు వచ్చేసరికి వ్యూవర్స్ మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 12వ వారానికి చేరుకోగా.. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఓ కొత్త టాస్క్ ఇచ్చారు. దీనికి 'బిగ్ బాస్ మ్యాన్షన్' అనే పేరు పెట్టారు. ఓ కిల్లర్ హత్యలు చేస్తుండగా.. పోలీసులు ఆ క్రిమినల్‌ను కనిపెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సూపర్ పర్ఫామెన్స్ చేసినవాళ్లు కెప్టెన్సీ టాస్క్‌కు కంటెండర్లుగా ఎంపిక అవుతారు. హౌస్ మెంబర్స్‌కు ఒక్కోఒక్కరికి ఒక క్యారెక్టర్ ఇచ్చి.. మధ్యలో కొందరికి సీక్రెట్ టాస్క్‌లు అప్పగించి మరింత రంజుగా మార్చారు.
శివాజీకి మిస్సెస్ బిగ్ బాస్‌ను హత్య చేసే హంతకుడి రోల్ ఇచ్చి.. సీక్రెట్ టాస్కును కూడా అప్పగించారు. బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి ఒకరిని హత్య చేయాల్సి ఉంటుంది. శివాజీని హత్య చేసే క్రమంలో సూచనలు అందించేందుకు ఓ మొబైల్‌ను కూడా ఇచ్చారు. ఈ టాస్కులో పల్లవి ప్రశాంత్‌ను డెడ్ చేసేశాడు శివాజీ. అయితే ప్రశాంత్ ఎలా చనిపోయాడనే విషయం హౌస్‌మెట్స్‌కు మిస్టరీగా మారింది. ప్రశాంత్ డెడ్ న్యూస్‌ను బిగ్ బాస్ ప్రకటించేసరికి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని ఎవరు కనిపెట్టలేపోయారు. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం తన తెలివితో కనిపెట్టేశాడు.
డెడ్ అయిన ప్రశాంత్ దెయ్యంలా మారిపోగా.. ప్రశాంత్‌తో 'ఏరా ప్రశాంత్.. నిన్ను హత్య చేసింది శివాజీ అన్ననే కదా..' అంటూ వాళ్లిద్దరికీ షాక్ ఇచ్చేశాడు. అయితే ఈ విషయంపై ప్రశాంత్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. గౌతమ్ కృష్ణ తెలివితేటలకు హౌస్‌మెట్స్ ఆశ్చర్యపోయారు. ఈ సీజన్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు.. తన ఆటతీరుతో బలమైన కంటెండర్‌గా ఎదిగాడు. ఫిజికల్ టాస్క్‌ల్లో గట్టిపోటీని ఇస్తునే.. మెంటల్‌గా ఎంతో స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు. అందులో ఏ గ్రూప్‌కు దగ్గర కాకుండా అందరితో కలిసి పోతున్నాడని ఆడియన్స్ అంటున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరు అయిన శివాజీని ఎదురించేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. అయితే గౌతమ్ కృష్ణ మాత్రం శివాజీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు. తన తెలివి తేటలు ఆటతీరుతో టాప్-5 రేసులోకి డాక్టర్ బాబు దూసుకువచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఆటతీరు కంటిన్యూ ఇస్తే ఫినాలేలో అడుగుపెట్టే అవకాశం ఉందని.. విన్నర్ రేసులో ఉంటాడని చెబుతున్నారు. చివరి వరకు ఆడియన్స్ ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook