Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీతో త్వరలో మార్కెట్‌లోకి Redmi 13C 5G..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Redmi 13C 5G Price: రెడ్ మీ(Redmi) నుంచి మార్కెట్‌లోకి మరో స్మార్ట్ ఫోన్‌ విడుదల కానుంది.  Redmi 12cకి సెక్సెర్‌గా కంపెనీ రెడ్మీ 13సీ లాంచ్‌ చేయనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి అధికారిక సమాచారాన్ని కంపెని అమెజాన్‌లో పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 10:59 AM IST
Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీతో త్వరలో మార్కెట్‌లోకి Redmi 13C 5G..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Redmi 13C 5G Price: ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ రెడ్ మీ(Redmi) తమ మరో స్మార్ట్ ఫోన్‌ని Redmi 13c పేరుతో విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కాబోతోంది. రెడ్మీ 13సీ (Redmi 13c)ని కంపెనీ అధికారిక వెబ్సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను రెడ్‌మీ Redmi 12cకి సెక్సెర్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ కూడా అతి చౌకగా లభించనుంది. 

అతి తక్కువ ధరలోని మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ Redmi 13c స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 7,000 లోపే పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో, విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్మీ 13సీ(Redmi 13c)స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ 5G వేరియంట్‌లో లాంచ్‌ చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పోస్టర్‌ను  అమెజాన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పోస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్ కొత్త లుక్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ Redmi 13c మొబైల్ కంపెనీ 16 జిబి ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభించనుంది. ఇక అన్ని బ్యాంక్ ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.7,999కే లభించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

రెడ్మీ 13సీ స్మార్ట్ ఫోన్‌ 6.74 అంగుళాలు HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ రాబోతోంది. అలాగే స్మడ్జ్ రెసిస్టెంట్ ఒలియోఫోబిక్ కోటింగ్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌ Mediatek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌పై రన్‌ కానుంది. మల్టీ టాస్కింగ్‌ కోసం ఈ ప్రాసెసర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ దీనికి హైపర్‌ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. రెడ్‌ మీ ఈ స్మార్ట్ ఫోన్‌ను 128GB+4GB RAM, 128GB+6GB RAM, 256GB+8GB RAM వేరియంట్స్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్‌ వెనక ప్యానెల్‌ విషయానికొస్తే..స్టైలిష్ చారలతో యాంటీ-స్లిప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ సెటప్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మింట్ గ్రీన్, లావెండర్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News