Kitchen Hacks: మన ఇంట్లో వంటగది ,బాత్ రూమ్ ,హాల్ లో ఖచ్చితంగా ఏదో ఒక మూల సింక్ లేదా వాష్ బేసిన్ ఉంటుంది. వంటింట్లో సింక్ పాత్రలు కడగడానికి ఉపయోగిస్తాం. వాష్ బేసిన్ అయితే చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించవచ్చు. సింక్ ,వాష్ బేసిన్ మధ్య సైజ్ లోనే కాదు చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంటుంది.
మీరు బాగా గమనించినట్లయితే వంటింట్లో ఉండే సింక్ కు పై భాగంలో ఎటువంటి రంధ్రం ఉండదు. కానీ వాష్ బేసిన్ కి మాత్రం కొళాయి కింద ఒక చిన్న రంధ్రాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ రంధ్రం కేవలం వాష్ బేసిన్ కి ఇచ్చి సింక్ కి ఎందుకు ఇవ్వలేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు వాష్ బేసిన్ కి ఆ రంధ్రం ఎందుకు ఇచ్చారో తెలుసా? అసలు దాని యూసేజ్ ఏంటో తెలుసుకుందాం..
మామూలుగా వాష్ బేసిన్ పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. పైగా వాష్ బేసిన్ పై ఎక్కువగా బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.ఒకవేళ మనం చేతులు కడుక్కునే సమయంలో నీరు ఎక్కువగా పేరుకు పోతే.. అవి కిందకు పొర్లుతాయి . కానీ ఇలా జరగకుండా ఉండడం కోసం ఈ అదనపు రంధ్రం వాష్ బేసిన్ లకు అమర్చడం జరిగింది. ఒకవేళ వాష్ బేసిన్ లో నీరు నిండుకున్నట్లయితే అదనపు నీరు ఆ రంధ్రం ద్వారా డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది. పైగా ఈ రంధ్రంలో ఎయిర్ ఫ్లోర్ సులభంగా జరుగుతుంది కాబట్టి పైపులో దుర్వాసన చేరకుండా ఉంటుంది.ఇలాంటి రంధ్రమే బాత్ టబ్ లకు కూడా ఉంటుంది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న వాష్ బేసిన్స్ కు ఇలాంటి రంధ్రాలు పెట్టడం లేదు. కేవలం పాతకాలం వాటికి మాత్రమే మనం ఇటువంటి రంధ్రాన్ని చూడగలుగుతాం.
అయితే కొన్ని సందర్భాలలో ఈ రంధ్రం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి అప్పుడు దుర్వాసన ఎక్కువగా వస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అయినా వాష్ బేసిన్ పైప్స్ నీట్ గా క్లీన్ అయ్యేలా చూసుకోవాలి. వీటి కోసం పలు రకాల కంపెనీలు ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నాయి…లేదు అనుకుంటే ఇటువంటివి ఇంటి వద్దనే సర్వీస్ చేసి ఇచ్చే ఏజెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ లేడీస్ అయినా.. ఈ విషయాలు తెలిసి పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇళ్లల్లో వాష్ బేసిన్ పెట్టుకునేటప్పుడు కూడా ఇలా రంద్రం ఉండేవి పెట్టుకోవడం ఎంతో లాభం. దానివల్ల దుర్వాసన రాకపోవడమే కాకుండా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.