Rohit Sharma: ఐపీఎల్ 2024 వేలానికి మరో రెండ్రోజులు మాత్రమే మిగిలుంది. ఐపీఎల్ బరిలో ఉన్న మొత్తం 10 ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ ఎక్కువగా చర్చల్లో ఉంటోంది. కారణం హార్డిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడమే. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకున్నారు. అదే సమయంలో రోహిత్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ కేపిటల్స్ సిద్ధమౌతోంది.
ఐపీఎల్ 2024కు ముందు ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టులో చేర్చుకుంది. అంతటితో ఆగకుండా కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది.
ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువ. ముంబై జట్టుకు ఐపీఎల్‌లో బ్రాండ్ టీమ్‌గా చేసింది రోహిత్ శర్మనే. అంతేకాకుండా కెప్టెన్‌గా జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించాడు. ఇంత విజయవంతమైన కెప్టెన్‌ను తప్పించడంపై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు తీసుకోనుండటంతో రోహిత్ శర్మను ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ కేపిటల్స్ జట్టు సిద్ధమౌతోంది. వాస్తవానికి హార్డిక్ పాండ్యా విషయంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే రోహిత్ శర్మను తీసుకోవాలని భావించినా..ముంబై ఇండియన్స్ నిరాకరించింది. ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటికే డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ ఇలా చాలామందిని కెప్టెన్‌లుగా చేసింది. కానీ టైటిల్ అందించే సరైన కెప్టెన్ లభించలేదు. అందుకే రోహిత్ శర్మను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook