Ayodhya Rammandir: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టకు సర్వం సిద్ఘమౌతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో జనవరి 22వ తేదీన హిందూవులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న రామమందిరం ప్రారంభం కానుంది. రామాలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇంతటి ప్రఖ్యాత ఘటనకు ముహర్తం ఎప్పుడు..ఇదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామమందిరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. జనవరి 22వ తేదీన రామాలయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. దేశ విదేశాల్నించి ప్రముఖులు తరలివస్తున్నారు. ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తజనం లక్షల్లో తరలివస్తారని తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేస్తోంది. జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు అద్భుతమైన ముహూర్తముందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో 84 సెకన్లు అద్వితీయమైన శుభ ఘడియలున్నాయంటున్నారు. ఆ సమయంలో ఒకవేళ రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందంటున్నారు.
జనవరి 22వ తేదీన మద్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 30 సెకన్ల మధ్య ఈ అద్భుత ముహూర్తముందని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయం ఆచార్యుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ చెబుతున్నారు. ఇది మేషలగ్నంలోని అభిజిత్ ముహూర్తమంటున్నారు. ఈ సమయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మద్యాహ్నం 12.15 గంటల్నించి 12.45 గంటల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
Also read: Ayodhya Rammandir: అయోధ్యలో ఆకాశాన్నంటుతున్న ధరలు, రూమ్ గది రోజుకు లక్ష రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook