Dil Raju: లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిల్వ‌ర్ జూబ్లీ.. సక్సెస్ చేయాలని దిల్ రాజు విన్నపం

Little Musicians Academy: ఎస్‌.పి బాలసుబ్రమణ్యం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా అలాంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులతో ప్రారంభ‌మైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 05:00 AM IST
Dil Raju: లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిల్వ‌ర్ జూబ్లీ.. సక్సెస్ చేయాలని దిల్ రాజు విన్నపం

Tollywood Singers: దివంగ‌త గాన గంధ‌ర్వుడు, తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన గాయకుడు ప‌ద్మ‌భూష‌ణ్ ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో 1999లో ప్రారంభ‌మైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. ఈ అకాడమీ ప్రత్యేకత ఏమిటి అంటే గురు రామాచారి ఆధ్వ‌ర్యంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఈ ఇన్స్టిట్యూట్ ఎంద‌రో గాయ‌నీ గాయ‌కులను అందించింది.

కాగా ఇలాంటి ఈ అకాడ‌మీ సిల్వ‌ర్ జూబ్లీ ఫినిష్ చేసుకుంటూ ఉండడంతో ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేష‌న్స్ వేడుక‌ల‌ను జ‌న‌వ‌రి 21న ఘనంగా హైద‌రాబాద్ శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా  సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…నిర్మాత దిల్ రాజు .

ముందుగా గురు రామాచారి మాట్లాడుతూ ‘‘‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సంస్థ నుంచి ఇప్ప‌టికే చాలా మంద‌వి ప్రొఫెష‌న‌ల్ గాయకులు వ‌చ్చారు. నేను చాలా మంది గురువుల ద‌గ్గ‌ర సంగీతాన్ని అభ్య‌సించాను. ఈ నేపథ్యంలో సంగీతం ప‌ట్ల అభిరుచి ఉన్న పిల్ల‌ల‌ను చేర‌దీసి పాటంటే ఏంటి? అందులో గ్రామ‌ర్ ఎలా ఉంటుంది? అందులోని మాధుర్యం ఏంటి? ఇలా చాలా విష‌యాల‌ను నేర్పిస్తూ వారిని పెద్ద సినిమాల్లో పాడే గాయ‌నీ గాయ‌కులుగా, రియాలిటీ షోస్‌లో పాడే సింగ‌ర్స్‌గా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో షోస్‌లో పాడే సింగ‌ర్స్‌గా మార్చటానికి మా కోర్ క‌మిటీ ,మెంబర్స్ సహాయంతో ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ ప్ర‌యాణంలో అంద‌రూ మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ప్రోత్స‌హిస్తున్నారు.  ముఖ్యంగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీనికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మాకు ఎంతో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. చాలా మంది టీవీ షోస్‌లో మా అకాడ‌మీ నుంచి పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇండియ‌న్ ఐడిల్ వ‌ర‌కు వెళ్లిన‌వాళ్లున్నారు. అలాగే జీ స‌రిగ‌మ‌ప వ‌ర‌కు కూడా వెళ్లారు. తెలుగులో కాకుండా ప‌లు భాష‌ల్లో పాటలు పాడుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎందరో శిష్యులున్నారు. ముఖ్యంగా తెలుగు నిర్మాత దిల్‌రాజుగారి కుటుంబం నుంచి నాకెంతో ప్రోత్సాహం ఉంది. దిల్ రాజుగారి మొద‌టి సినిమా నుంచి ఆయ‌న‌తో ఏదో ర‌కంగా వ‌ర్క్ చేస్తున్నాను. 

ఎం.ఎం.కీర‌వాణిగారు, దర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు,  కోటిగారు ఇలా ఎంద‌రో త‌మ వంతు స‌హ‌కారాన్ని మాకు అందిస్తున్నారు. భ‌గ‌వంతుడి ఆశీస్సుల‌తో ఇక్క‌డి వ‌ర‌కు మేము రాగలిగాము. జ‌న‌వ‌రి 21న‌ మేం సిల్వ‌ర్ జూబ్లీ ఉత్సవాల‌ను జ‌రుపుకుంటున్నాం. ఈ ఉత్స‌వానికి సార‌థ్యం వ‌హించాల‌ని రాఘ‌వేంద్రరావు, దిల్ రాజుగారిని కోర‌గానే వారు అసలు ఏమీ ఆలోచించకుండా మాకు సార‌థ్యం వ‌హించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంద‌రూ హాజ‌రు కావాల‌ని కోరుకుంటున్నాను’’ అని తెలియజేశారు. 

ఇక ఆ తరువాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మా మొదటి సినిమా దిల్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య రాసిన మమ్ము కాచినవాడు.. సాంగ్ కు రామాచారిగారే పాటను చక్కగా సమకూర్చారు. ఇప్పటికీ మా సినిమాలకు ముందు ఆ పాటే వస్తుంది. దిల్ చిత్రం నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది... దిల్ సినిమా చేస్తున్న‌ప్పుడు అప్పుడ‌ప్పుడే ఇక్క‌డ తెలుగు సినీ ఇండ‌స్ట్రీ పెరుగుతుంది. ఆ స‌మ‌యంలో రామాచారిగారు ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ గురించి నాకు తెలియజేశారు. రామాచారిగారు ఎంతో మంది గాయ‌నీగాయ‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌ట‌మే కాకుండా.. ఎంతో మంది చిన్న‌పిల్ల‌ల‌కు కూడా మ్యూజిక్  ప‌ట్ల మ‌క్కువ‌ను పెంచారు. మ‌న తెలుగు సినిమాకు కావాల్సిన గాయ‌నీగాయ‌కుల‌ను ఎంతో మందిని అందించారు. అలాంటి ఈ సంస్థ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను జ‌న‌వ‌రి 21న శిల్ప‌క‌ళావేదిక‌లో నిర్వ‌హిస్తున్నారు. రాఘవేంద్ర‌రావు, న‌న్ను క‌లిసి సార‌థ్యం వ‌హించ‌మ‌ని అడిగారు. ఈ అకాడ‌మీలో ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తున్నారు. ఈ 25 సంవత్సరాలుగా వారు ఇండ‌స్ట్రీకి త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు. ఇప్పుడు అంద‌రం ఈ వేడుక‌కు త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేయాల‌ని కోరుతున్నాం. ఇండ‌స్ట్రీ నుంచి ప్ర‌ముఖుల‌ను ఆహ్వానిస్తున్నాం. అంద‌రూ ఈ వేడుక‌కి హాజ‌రై వేడుక‌ను స‌క్సెస్ చేయాల‌ని కోరుతున్నాను. అంతేకాకుండా వీళ్లు ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ని రెంట‌ల్ బిల్డింగ్‌లోనే నిర్వ‌హిస్తున్నారు. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వానికి వీరికి ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం వ‌చ్చేలా చేయాల‌నే ఆలోచ‌న ఉంది. రామాచారిగారి లాంటి వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తే స‌మాజానికి కూడా ఎంతో ఉపయోగం’’ అని తెలియజేశారు. 

ఇక ఈ కార్య‌క్ర‌మంలో సింగర్ ర‌మ్యా బెహ‌రా స‌హా ప‌లువురు గాయ‌నీ గాయ‌కులు పాల్గొన్నారు.

Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News