Sunway Chess Festival: స్పెయిన్‌లోని సిట్జెస్ నగరంలో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ జరుగుతోంది. భారత్ తరపున ఈ టోర్నీలో పాల్గొనేందుకు 70 మందితో కూడిన చెస్ బృందం స్పెయిన్‌కు వెళ్లింది. ఈవెంట్ వేదిక నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో భారత ఆటగాళ్లకు బస ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయితే భారత గ్రాండ్‌మాస్టర్లు సంకల్ప్ గుప్తా(Sankalp Gupta), దుష్యంత్ శర్మతోపాటు శ్రీజ శేషాద్రి, మౌనికా అక్షయ, అర్పిత ముఖర్జీ, విశ్వ షా ఉంటున్న గదుల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్, నగదు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సహా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. తమ వస్తువులు దొంగతనానికి గురైన విషయాలను ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
తొలి దొంగతనం డిసెంబర్ 19న సంకల్ప్ గుప్తా మరియు దుష్యంత్ శర్మ కలిసి నివసిస్తున్న గదిలో జరిగింది. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత.. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో రెండు వేర్వేరు అపార్ట్మెంట్ల్లో దొంగల భీభత్సం సృష్టించారు. మొదట మౌనిక అక్షయ్‌తో సహా ఐదుగురు ప్లేయర్లు ఉంటున్న అపార్ట్మెంట్, ఆపై అర్పితా ముఖర్జీ-విశ్వ షా ఉంటున్న అపార్ట్మెంట్ చోరీకి గురయ్యాయి. అయితే అదే ఫ్లాట్ ల్లో ఉంటున్న ఇతర దేశాల క్రీడాకారుల వస్తువులు చోరీకి గురికాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా ఘటనపై ఆ ఆరుగురు క్రీడాకారులు అక్కడ పోలీసులను ఆశ్రయించినా నిరాశే మిగిలింది. మేము ఏమీ చేయలేమంటూ ఆటగాళ్లను వెనక్కి పంపేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ ఆరుగురు ఎవరైనా ఆదుకోపోతారని ఎదురుచూస్తున్నారు.
Burglary in #SPAIN #Sunway APOLO APARTMENT on 19 Dec in my room. My Laptop, Passport, cash etc & my roommate’s laptop,airpods stolen. Later on,similar thefts happened with other Indian chess players too. Requesting @SunwayChessOpen @IndiainSpain @ianuragthakur @DrSJaishankar Help pic.twitter.com/daKdjusy45
— Dushyant Sharma (@chess_dushyant) December 24, 2023
Also Read: MS Dhoni-Pant: శాంతాక్లాజ్ దుస్తుల్లో మెరిసిన ధోనీ, పంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook