Bigg Boss OTT Season 2: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు. అంతలా సక్సెస్ అయింది ఈ షో. ఇప్పటికే ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలో రెండో ఓటీటీ సీజన్ తో రాబోతుంది. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీ షో ‘బిగ్‌బాస్ నాన్- స్టాప్’ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అయిన షో ఓటీటీ లవర్స్ ను బాగానే అలరించింది. ఈ షో విజేతగా బిందు మాధవి నిలిచింది. గత ఓటీటీ సీజన్ కంటే ఎక్కువ వినోదాన్ని పంచేందుకు నిర్వాహకులు గట్టిగానే ఫ్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఓటీటీ సీజన్ రాబోతుందని ఇటీవల ముగిసిన ఏడో సీజన్లోనే హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ఫిబ్రవరిలోనే ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
హౌజ్ లోకి బర్రెలక్క..
అయితే గత సీజన్ లో పాత కంటెస్టెంట్లను, కొత్త కంటెస్టెంట్లను కలిపి ఓటీటీ సీజన్ కు తీసుకొచ్చారు. అయితే ఈసారి కూడా అలానే ఉండబోతుందని టాక్. రీసెంట్ గా సీజన్ 7లో అలరించిన సింగర్ భోలో షావలి, నయని పావనిలు ఓటీటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె శిరీష అలియాస్ బర్రెలక్క . రీసెంట్ గా ఈమె ఫేమస్ అయినట్లు ఇంకెవ్వరూ కాలేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్‌తో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసింది బర్రెలక్క. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఈమె పేరు మాత్రం మార్మోగిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందట.
Also Read: Vijayakanth Passed Away: విజయ్ కాంత్ మరణానికి కారణాలు ఇవే..!
మరోవైపు సరిగమప షోతో పాపులరైన పార్వతిని కూడా ఈ ఓటీటీ షో కోసం సంప్రదించారట. అలాగే నవాబ్ కిచెన్ తో సోషల్ మీడియాలో మాంచి క్రేజ్ తెచ్చుకున్న మోయిన్ భాయ్‌ను కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. వీరితోపాటు మరికొంత మంది సోషల్ మీడియా సెలబ్రెటీలను ఎంపిక చేసే పనిలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
Also Read: Vijaykanth: విజయ్ కాంత్ సినిమా రీమేక్ లతో హిట్లు కొట్టిన చిరంజీవి, వెంకటేష్.. ఆ మూవీస్ ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook