Devara Audio Rights: దేవర ఆడియో హక్కులను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన బాలీవుడ్ బడా సంస్థ...

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్,  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా దేవర. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్ ఊహించని ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 03:26 PM IST
Devara Audio Rights: దేవర ఆడియో హక్కులను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన బాలీవుడ్ బడా సంస్థ...

Devara Movie Audio Rights: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr) నయా మూవీ దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది  శ్రీదేవి కూతురు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా జనవరి 08న విడుదల చేయనున్నారు. 

మరోవైపు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయట. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన సంస్థ టీ సిరీస్ సంస్థ దేవ‌ర ఆడియో రైట్స్ ను కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంత రేటుకు అమ్ముడైన విషయం మాత్రం తెలియరాలేదు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Curry and Cyanide: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కర్రీ & సైనేడ్.. 30 దేశాల్లో హవా కొనసాగిస్తున్న సిరీస్..

ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మెుదటి పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 05న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Also Read: Thandel Glimpse: 'ఈపాలి ఏట గురితప్పేదేలే' అంటున్న నాగ చైత‌న్య... 'తండేల్' గ్లింప్స్ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News