పశ్చిమగోదావరి : అవకాశవాద రాజకీయాలు, రాజకీయ నేతలపై హామీలపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల సయయంలో నేతలు హామీలు గుప్పిస్తారు..తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని విస్మరిస్తారు. జనాలను పిచ్చోళ్లను చేయాలంటే ఇక కుదరదు..అవకాశవాద రాజకీయాలకు చమరగీతం పాడేందుకు జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏలూరులోని క్రాంతి కల్యాణ వేదికలో ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు, ‘మీ సేవ’ నిర్వాహకులతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అది నెరవేర్చకుంటే..దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. హామీల విషయంలో నేతల తీరు మారాలి..వాళ్లు మారకుంటే ఆ పరిస్థతిని మేం తీసుకొస్తామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హితబోధ చేశారు.