Realme 12, Realme 12 Pro, Realme 12 Pro Plus: కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కొక్క టెక్ బ్రాండ్ తమ స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేసుకుంటూ వస్తున్నాయి. ఇటీవలే వన్ ప్లస్, ఒప్పో, రెడ్ మీ కంపెనీలు తమ 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేయగా.. రియల్ మీ కూడా తమ 12 సిరీస్ ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రియల్ మీ 12 సిరీస్ మొత్తం మూడు మోడల్స్ (Realme 12, Realme 12 Pro, Realme 12 Pro Plus)లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు వివరాల్లోకి వెళితే రియల్ మీ 12 సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీకైనట్లు తెలుస్తోంది. అయితే ఈ లీకైన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రియల్ మీ 12 సిరీస్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ను ప్రముఖ డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్‌స్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లీకైన వివరాల ప్రకారం Realme 12 Pro స్మార్ట్ ఫోన్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ ఇంతకుముందు ఎప్పుడు చూడని మోడల్స్ లో తీసుకురాబోతున్నట్లు టిప్ స్టర్ వెల్లడించారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
ఈ మొబైల్స్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే మధ్యలో ఒక పంచ్ హోల్, ఆకర్షణీయమైన లుక్‌తో రాబోతున్నాయి. డిస్ప్లే మధ్యలోనే సెల్ఫీ కెమెరాను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్స్‌కు సంబంధించి వెనుక ప్యానెల్ విషయానికొస్తే.. నాలుగు కటౌట్లను కలిగి ఉన్న వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అంటే ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ కెమెరాతో పోతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన పూర్తి వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ TENAA జాబితా ఎక్స్ ఖాతా ద్వారా చేశారు.
త్వరలో లాంచ్ కాబోయే Realme 12 Pro రంగుల వేరియంట్ల విషయానికొస్తే.. కంపెనీ మొత్తం బ్లాక్, ఆరెంజ్, వైట్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రియల్ మీ లెవెన్ సిరీస్ లాగా వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో రావచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్‌లో కొన్ని శక్తివంతమైన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.
ఇతర ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:
ఎడ్జ్ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
5,000mAh బ్యాటరీ
ట్రిపుల్ కెమెరా సెటప్
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter