అక్టోబ‌ర్ 1 'స‌వ్యసాచి'గా వస్తున్న చైతూ

అక్టోబ‌ర్ 1 'స‌వ్యసాచి'గా వస్తున్న చైతూ

Last Updated : Sep 30, 2018, 10:35 AM IST
అక్టోబ‌ర్ 1 'స‌వ్యసాచి'గా వస్తున్న చైతూ

అక్కినేని నాగ చైత‌న్య‌- చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'స‌వ్యసాచి'. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సవ్యసాచి అంటే రెండు చేతులని సమర్థవంతంగా, శక్తివంతంగా వాడే వాళ్లు అని అర్థం. ఈ చిత్రంలో నాగ చైతన్య తన రెండు చేతులని సమర్థవంతంగా వాడి పరిస్థితుల్ని, ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు కీలక పాత్రలు పోషించారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్న‌ ఈ చిత్ర టీజ‌ర్‌ని అక్టోబ‌ర్ 1 ఉద‌యం 10గం.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలిపింది. న‌వంబ‌ర్ 2న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుందని తెలిసింది.

అటు చైతూ, సమంతలు కలిసి జోడీగా ఓ కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు మజిలి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 

 

Trending News