YCP 4th List: వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భారీగా మార్పులు చేర్పులతో నియోజక వర్గాల ఇన్ఛార్జ్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 59 నియోజకవర్గాల జాబితా విడుదలైంది. ఇప్పుడు మరో 14 మందితో నాలుగో జాబితా విడుదలకు సిద్ఘంగా ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనున్న నాలుగో జాబితాలో సినీ రంగ ప్రముఖులు, తెలుగుదేశం నుంచి వచ్చి చేరినవారు ఉండవచ్చని అంచనా. తొలి మూడు జాబితాల ద్వారా భారీ మార్పులు చేశారు. కొందరిని తప్పించారు. ఇంకొందరిని నియోజకవర్గం మార్చారు. మరి కొందరిని ఎమ్మెల్యేల నుంచి ఎంపీలుగా, ఎంపీల్నించి ఎమ్మెల్యేలుగా మార్చారు. ఇప్పుడు సిద్ధమైన నాలుగో జాబితాలో కీలక మార్పులు ఉండనున్నాయి. నర్శరావు పేట లోక్‌సభ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు గుంటూరు కేటాయించాలనేది వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది. నర్శరావుపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీసీలకు అవకాశం లేకపోవడంతో ఎంపీ బీసీలకు కేటాయించాలని అనుకుంటున్నారు. నర్శరావు పేట స్థానంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు పేరు విన్పిస్తోంది. విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి పీలా రమాకుమారి, కాకినాడ నుంచి చెలమలశెట్టి సునీల్ కుమార్, బాపట్ల నుంచి నందిగం సురేశ్, నర్శాపురం నుంచి గోకరాజు రంగరాజు పేర్లు దాదాపుగా ఖాయమయ్యాయి.
ఇక మచిలీపట్నం నుంచి వంగవీటి రాధా లేదా మాజీ ఎంపీ కుమార్తె పేర్లు విన్పిస్తున్నాయి. రాజమండ్రి నుంచి వివి వినాయక్ , నంద్యాల లేదా గుంటూరు నుంచి అలీ పేర్లు విన్పిస్తున్నాయి. అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్ లేదా టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు పేర్లు విన్పిస్తున్నాయి. నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రబాకర్ రెడ్డి పేరు ఖాయమైంది. మొత్తం జాబితా ఖరారయ్యాక...ప్రజల్లోనే తిరగాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Also read: Dr BR Ambedkar Statue: ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook