Fat Burner Drink: అధిక కొవ్వు, బరువును తగ్గించడంలో ఈ డ్రింక్‌ ఎంతో మేలు చేస్తుంది!

Weight Loss Drinks: అధునిక జీవనశైలిలో అధిక బరువు సమస్య బారిన చాలామంది బాధపడుతున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల  బారిన పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 09:53 PM IST
Fat Burner Drink: అధిక కొవ్వు, బరువును తగ్గించడంలో ఈ డ్రింక్‌ ఎంతో మేలు చేస్తుంది!

Weight Loss Drinks: అధిక బరువు సమస్యతో బాధపడేవారు మందులను, ఎక్కువ ఖర్చు పెట్టి బరువు తగ్గాల్సిన అవసరం లేదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సులువుగా తయారు చేసే డ్రింక్‌ వల్ల బరువును తగ్గవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ డ్రింక్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ డ్రింక్ ను తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో పొట్ట‌, పిరుదులు, తొడ‌లు , చేతులు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా కరిగిపోతుంది.

ప్ర‌స్తుత కాలంలో చాలా మంది వివిధ భాగాల్లో  ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇబ్బందులు ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం వల్ల ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణమని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.

అధిక బ‌రువు,శరీరంలో కొవ్వును తొలగించడంలో కొన్ని పదార్థాలు సహాయపడుతాయి. దీని కోసం ఫ్యాట్‌ కట్టర్‌ డ్రింక్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ డ్రింక్ ను త‌యారు చేసుకోవ‌డానికి  కీర‌దోస‌ను తీసుకోవాలి. త‌రువాత కొత్తిమీర, అల్లం, నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. 

Also Read  Muscle Cramps: ఏం చేసినా కండరాలలో తిమ్మిర్లు తగ్గడం లేదా? రూపాయి ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టండి..

డ్రింక్‌ను తయారు చేసుకోనే విధానం: 

కీరదోసను, అల్లాన్ని, కొత్తిమీర‌ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.  ఇప్పుడు జార్ లో కీర‌దోస ముక్క‌ల‌ను, కొత్తిమీర‌ను, అల్లాన్ని, త‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న డ్రింక్‌ను రాత్రి భోజ‌నం చేసిన ఒక గంట త‌రువాత తాగాలి. ఇలా నెల‌రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 

ఈ విధంగా శ‌రీరంలో కొవ్వును, అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగడం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Also Read Ginger Tea Vs Ginger Water: ఆరోగ్యానికి అల్లం టీ బెస్టా..అల్లం వాటర్‌ బెస్టా?..తప్పకుండా తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News