Home Cleaning Tips: సాధారణంగా మన అందరి ఇళ్లలో కాఫీపొడి ఉంటుంది. లేదంటే దుకాణం నుంచి కొనుగోలు చేసినా రూ. 2 నుంచి మొదలవుతుంది. ఈ కాఫీ ప్యాకెట్ మన ఇంటిపనుల్లో రకరకాలు ఉపయోగపడుంది. మీ పనిని సులభతరం చేస్తుంది. ఎలానో తెలుసుకుందాం.
కాఫీ ప్రతిరోజూ తీసుకుంటాం. దీన్ని ఫేస్ ప్యాక్ మాదిరి వేసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా హెయిర్ ప్యాక్లో కూడా ఉపయోగిస్తారు. సౌందర్యపరంగా ఇలా ఉపయోగపడుతుంది కాఫీ. అయితే, ఇంటి పనుల్లో కూడా కాఫీపొడి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఫర్నిచర్ క్లీనింగ్..
రెండు చెంచాల నీరు, ఒక చెంచా ఉప్పువేసి ఈ కాఫీపొడి ప్యాకెట్ తో శుభ్రంగా ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ లిక్విడ్ ను రంగుమారిన ఫర్నిచర్ ను శుభ్రం చేసుకోవచ్చు. కాటన్ గుడ్డతో శుభ్రం చేస్తే చెక్క ఫర్నిచర్ రంగు కూడా మారదు. కొత్తవాటిలా మెరిసిపోతాయి.
గాజు..
గాజు వస్తువులను క్లీన్ చేయడానికి కాఫీపొడి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సాధారణంగా గాజు వస్తువులపై మరకలు పడితే సున్నితంగా క్లీన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కాఫీ ప్యాకెట్, నిమ్మకాయ రసం కలిపి పిచికారీ తయారు చేసుకోవాలి. ఇలా పాతబడిన గాజు వస్తువులను ఈ పిచికారీతో శుభ్రం చేస్తే అవి తళతళా మెరుస్తాయి.
ఇదీ చదవండి: Optical Illusion: మీరు నిజంగా మేధావినా? అయితే, 5 సెకన్లలో ఈ ఫోటోలో YOY కనిపించిందా?
సింక్ జామ్..
కిచెన్ సింక్ జామ్ అయితే దాన్ని శుభ్రం చేయడానికి కాఫీ ఉత్తమ ఎంపిక. దీని కోసం కాఫీ పొడితోపాటు లిక్విడ్ డిటర్జెంట్, వేడినీరు అవసరం. కిచెన్ సింక్ నుండి నీరు బయటకు రాకపోతే ముందుగా అందులో కాఫీ పౌడర్ ,లిక్విడ్ సోప్ వేయండి. దీని తరువాత అందులో వేడినీరు పోయండి. ఇలా చేయడం వల్ల సింక్‌లో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. దీంతో పాటు సింక్ నుంచి వచ్చే వాసన కూడా పోతుంది.
ఇదీ చదవండి: Toilet Doors Gap: సినిమా హాలు, మాల్స్ లో టాయిలేట్ డోర్స్ కింద గ్యాప్ ఎందుకు ఉంటుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook