Wheat Dosa: గోధుమ‌పిండి దోశ ఇలా చేయండి.. బ్యాచ్‌లర్స్ కూడా నేర్చుకోండి

Wheat Dosa recipe: గోధుమ‌పిండితో చాలా మంది రొట్టలను తయారు చేస్తారు. కానీ ఈ గోధుమపిండితో దోశను తయారు చేసుకోవడం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 11:56 AM IST
Wheat Dosa: గోధుమ‌పిండి దోశ ఇలా చేయండి.. బ్యాచ్‌లర్స్ కూడా నేర్చుకోండి

Wheat Dosa recipe: దోశ అంటే చాలా మందికి పిచ్చి. వేడి వేడి దోశ అలా పెన్నం మీద నుంచి తీసి.. చట్నీలో వేసుకుని తింటే వచ్చే ఆ కిక్కే వేరు. దోశలో చాలా రకాలు ఉన్నాయి. ప్రత్యేకంగా దోశ స్పెషల్ హోటల్స్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా గోధుమ పిండి దోశలు తిన్నారా..? గోధుమ‌పిండితో చాలా మంది రొట్టలను తయారు చేస్తారు. కానీ ఈ గోధుమపిండితో దోశను తయారు చేసుకోవడం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని టిఫిన్‌ గా కూడా తీసుకోవచ్చు. దీని తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం

గోధుమ‌పిండి దోశ కి కావాల్సిన ప‌దార్థాలు:

గోధుమ‌పిండి, బొంబాయి ర‌వ్వ, పుల్ల‌టి పెరుగు , ఉప్పు, ప‌సుపు, జీల‌కర్ర, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి, అల్లం త‌రుగు, త‌రిగిన కొత్తిమీర, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ 

గోధుమ‌పిండి దోశ త‌యారీ విధానం:

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోని ర‌వ్వ వేసి క‌ల‌పాలి. పెరుగుతో పాటు మిగిలిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. దోశ‌పిండిలా క‌లుపుకున్న త‌రువాత పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గోధుమ‌పిండి దోశ త‌యార‌వుతుంది. 

Also Read White Hair Turn Black Naturally: తెల్ల జుట్టును సులభంగా నల్లగా మార్చేసే అద్భుతమైన చిట్కాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News