Lava Yuva 3 Price: ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ Lava Yuva 3 మొబైల్‌ వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Lava Yuva 3 Price In India Telugu: అతి తక్కువ ధరలోనే లావా నుంచి మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను 64GB + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్‌ వివరాలు ఇవే.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 1, 2024, 12:25 PM IST
Lava Yuva 3 Price: ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ Lava Yuva 3 మొబైల్‌ వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Lava Yuva 3 Price In India Telugu: చీప్‌ అండ్‌ బెస్ట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ప్రముఖ టెక్‌ కంపెనీ లావా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ అతి చౌక ధరలో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఈ మొబైల్‌ను lava yuva 3 మోడల్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంపెనీ  ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మైక్రో-సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే ఈ lava yuva 3 స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయిన తర్వాత అమెజాన్‌లో విక్రయించబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

అమెజాన్‌లోని అందుబాటులోబ ఉన్న టీజర్‌ ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్‌  128GB UFS 2.2 స్టోరేజ్‌ ఆప్షన్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ Yuva 3లోని UFS 2.2 స్టోరేజ్ eMMC స్టోరేజ్ కంటే మూడు రేట్లు శక్తివంతంగానూ, స్పీడ్‌ గాను ఉంటుందని పలువురు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ మొబైల్‌ 4GB స్టోరేజ్ ఆప్షన్‌ నుంచి 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఎక్స్‌పాండబుల్ చేసుకునే విధంగా సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. 

ముందుగా లావా కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 64GB + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ వేరియంట్‌లు UFS 2.2 స్టోరేజ్‌తో అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో పాటు కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అదనంగా ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను పెంచుకోవడానికి ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏయే వేరియంట్‌లో విడుదల చేస్తారనేది కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. 

లావా Yuva 3 ధర వివరాలు:
అతి త్వరలోనే విడుదల కాబోయే లావా Yuva 3 స్మార్ట్‌ ఫోన్‌  Yuva 3 Pro కంటే అతి చౌకగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఇందులో ఫీచర్స్‌ పరంగా ప్రో మోడల్‌తో పోలిస్తే తక్కువే ఉండే ఛాన్స్‌ ఉంది.  భారత్‌లో లావా యువ 3 ప్రో ధర 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999 కాగా..4GB ర్యామ్‌ 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ రూ.6,999కు విక్రయించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక లాంచ్‌ కాబోయే Lava Yuva 3 ధర రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Lava Yuva 3 Pro ఫీచర్స్‌:
Unisoc T616 ప్రాసెసర్
Mali G57 GPU
6.5 అంగుళాల LCD డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ 
డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
గ్లాస్ బ్యాక్ ప్యానెల్

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News