Anurag University: కళాశాలలో జరిగిన పరిణామాలతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కళాశాలకు రావడం లేదని, పరీక్షల్లో వరుసగా ఫెయిలవుతున్నాడని కళాశాల యాజమాన్యం కొంత మందలించింది. క్రమశిక్షణ పాటించకుండా కళాశాలకు ఇష్టమొచ్చిన రీతిలో వస్తున్నాడని అధ్యాపకులు నీట్‌గా రావాలని సూచించారు. అంతే ఆ విద్యార్థి ఆవేశానికి లోనయ్యాడు. తరచూ అధ్యాపకులు వేధిస్తున్నాడని భావించి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పైనుంచి కిందపడడంతో గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులో జరిగింది.
Also Read: Election Commission: 'పిల్లలను' తీసుకెళ్తే ఇకపై బెండు తీసుడే.. రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి మేడ్చల్ జిల్లాలోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే సక్రమంగా కళాశాలకు వెళ్లడం లేదు. సక్రమంగా వెళ్లకపోవడంతో తరగతులు కోల్పోయాడు. పరీక్షలు పెడితే అన్నింటిలోనూ ఫెయిలయ్యాడు. దీంతో కళాశాల డీన్ కేఎస్ రావు అతడిని బుధవారం (ఫిబ్రవరి 7న) మందలించారు.
తల జట్టు పెరగడంతో కటింగ్ చేయించుకోవాలని కూడా సూచించారు. అయితే తోటి విద్యార్థుల ముందే మందలించడంతో జ్ఞానేశ్వర్ మనస్తాపానికి లోనయ్యాడు. వెంటనే భవనం రెండో అంతస్తు పై నుంచి కిందకు దూకాడు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో కళాశాల యాజమాన్యం దిగ్భ్రాంతికి గురయ్యింది.
Also Read: Raw Cat Eat: దేశంలో ఇంకా ఆకలి కేకలా.. దేశాన్ని నివ్వెరపరిచిన 'పిల్లిని తిన్న యువకుడు' సంఘటన
గాయాలపాలైన అతడిని వెంటనే కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆస్ప్రత్రికి వచ్చి పరిశీలించారు. కళాశాల యాజమాన్యంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీన్‌పై బాధితుడి సోదరుడు స్వాతిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన డీన్ వివరణ ఇచ్చారు. 'నేను విద్యార్థికి కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చా. అతడిపై చేయి చేసుకోలేదు. నిత్యం కళాశాలకు రావడం లేదు. మొదటి సెమ్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. కళాశాలకు పద్ధతి లేకుండా హాజరవుతున్నాడు. హెయిర్ కట్ భారీగా పెరగడంతో కటింగ్ చేయించుకోవాలని సూచించా. అంతే. ఈ విషయాలను విద్యార్థి తండ్రికి ఫోన్లో కూడా చెప్పా. కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook