Mahesh Babu - Guntur Kaaram OTT News: సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'గుంటూరు కారం'. గతంలో వీళ్లిద్దరి కలయిలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ సిల్వర్ స్క్రీన్ పై కాకుండా స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్టైయింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన గుంటూరు కారం మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ సొంతం చేసుకొని అభిమానులను ఒకింత నిరాశ పరిచింంది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది.
గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. దీంతో ఫస్ట్ డే ఈ మూవీ దాదాపు రూ. 90 కోట్ల గ్రాస్.. రూ. 55 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా తన పేరిట రికార్డులను నమోదు చేసుకుంది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గుంటూరు కారం సినిమాకు ఒకింత నష్టం చేకూర్చింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.
బిగ్ స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడనే చెడ్డ పేరు త్రివికమ్ర్కి వచ్చింది. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా కథను నడింపించాడు. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్‌ను రాసుకున్నాడు మాటల మాంత్రికుడు. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ స్టోరీతో పాటు స్క్రీప్ ప్లేపై పూర్తిగా కేటాయించ లేకపోయాడు గురూజీ. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ బాబు ఇమేజ్ను నమ్ముకునే తెరకెక్కించాడు. ఆయన నమ్మకాన్ని మహేష్ బాబు నిలబెట్టాడు.మొత్తంగా పండగ సీజన్లో ఇలాంటి టాక్‌తో ఈ సినిమా దాదాపు 90 శాతం రికవరీ సాధించడం వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు పండగ సీజన్ కూడా కలిసి వచ్చింది. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ మార్క్ డైలాగులు వినపడ్డాయి.
ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు కుర్చీ మడతపెట్టి సాంగ్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయించడంపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ విడుదల తర్వాత అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ పాటలో మహేష్ బాబు.. శ్రీలీలతో కలిసి వేసిన స్టెప్పులతో థియేటర్స్ అదిరిపోయాయి. తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడానికి మరో కారణం ఉంది. ఈ మూవీ ప్రీమియర్స్ రోజునే కొన్ని చోట్ల HD ప్రింట్స్ బయటకు రావడం ఈ సినిమాకు గుదిబండగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 120 కోట్ల షేర్.. (రూ. 200 కోట్ల గ్రాస్) వరకు రాబట్టినట్టు సమాచారం. గుంటూరు కారం సినిమా థియేట్రికల్‌గా రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.15 కోట్లకు అటు ఇటుగా ఆగిపోయింది. ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.
అది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. తాజాగా ఈ సినిమా అర్ధరాత్రం నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేట్రికల్‌గా అబౌ యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు హిట్ అందుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook