Nothing Phone 2a Price: నథింగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. తక్కువ ధర, ఆకట్టుకునే ఫీచర్లు..

Nothing Phone 2a Price: నథింగ్ నుంచి మరో ఆకర్షణీయమైన ఫోన్ రాబోతుంది. ఇది నథింగ్ ఫోన్ 2 కంటే తక్కువ ధరలో ఉండబోతుందని తెలుస్తోంది. దీని ఫీచర్లు, ధర ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 10:00 PM IST
Nothing Phone 2a Price: నథింగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. తక్కువ ధర, ఆకట్టుకునే ఫీచర్లు..

Nothing Phone 2a will launch Soon: నథింగ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రాబోతుంది. అదే నథింగ్ ఫోన్ 2a. నథింగ్ ఫోన్ 2తో పోలిస్తే ఇది తక్కువ ధరలోనే ఉంటుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్2 ఇండియన్ మార్కెట్లో రూ. 44,999కి లాంఛ్ కాగా.. ఫోన్ 2a రూ. 35,000 కంటే తక్కువ ధర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ 2a డిజైన్‌కు సంబంధించిన లీక్స్ బయటకు వచ్చేశాయి. 

ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో, ఫ్రంట్ కెమెరా 32-మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. ఇది 6.7-అంగుళాల 120Hz OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ 2a మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ రాబోతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4,500mAh మరియు 4,800mAh మధ్య ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5లో రన్ అయ్యే అవకాశం ఉంది. మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు మరియు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందించే అవకాశం ఉంది. ఇది 45వాట్స్ పాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రాబోతుంది. ఇది ఫిబ్రవరి 27న విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని విడుదల తేదీ, మరిన్ని పీచర్లు త్వరలో లాంఛ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read: Personal Loan Interest Rate: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, టాప్ 5 బ్యాంకులు, వడ్డీ రేట్లు ఇవే

గతేడాది రిలీజైన నథింగ్ ఫోన్ 2 పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఎందుకంటే దీని ధర ఎక్కువగా ఉండటం, ఫీచర్స్ ఆకట్టుకోకపోవడంతో నథింగ్ ఫోన్2 ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధర, ఆకట్టుకునే ఫీచర్లతో నథింగ్ ఫోన్2ఏ ను తీసుకురాబోతున్నారు. 

Also Read: Best Investment plans: మీ అమ్మాయి భవిష్యత్‌కు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News