Tomato - Gongura Pachadi: వేడివేడి అన్నంలో ఈ టమాటో, గోంగూర రోటి పచ్చడి వేసుకొని తింటే..నా సామి రంగ!

Tomato - Gongura Pachadi Andhra Style: గోంగూర రోటి పచ్చడి నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి కూడా అనేక రకాలుగా సహాయపడుతుంది ఇందులో ఉండే గుణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇది మీకోసమే..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 12, 2024, 10:53 PM IST
Tomato - Gongura Pachadi: వేడివేడి అన్నంలో ఈ టమాటో, గోంగూర రోటి పచ్చడి వేసుకొని తింటే..నా సామి రంగ!

Tomato - Gongura Pachadi Andhra Style: భారతీయులు టమాటోను ఎక్కువగా అన్ని వంటకాల్లో వినియోగిస్తూ ఉంటారు ఎందుకంటే ఇవి వంటకాల రుచిని రెట్టింపు చేయడమే కాకుండా చిక్కదనాన్ని అందజేస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే టమాటో లేనిది రోటి పచ్చళ్ళు కూడా చేయరు. టమాటాలను వంటలకు వంటకాలకు రారాజుగా పిలుస్తారు. ముఖ్యంగా టమాటో, గోంగూరతో తయారుచేసిన రోటి పచ్చడిని గురించి చెప్పనక్కర్లేదు. ఈ పచ్చడిని చూస్తే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. అయితే చాలామంది దీనిని తయారు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఇకనుంచి ఏ మాత్రం కష్టపడనక్కర్లేదు మేము చెప్పే కొలతల పద్ధతిలో చేసుకుంటే అచ్చం హోటల్స్ లో లభించే గోంగూర టమాట పచ్చడిలా ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర టమాట పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇవే:
ఒకటిన్నర టేబుల్ స్పూన్ పళ్ళు నూనె
25 ఎండుమిర్చిలు
రెండు టేబుల్ స్పూన్ల మెంతులు
ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు
అర టీ స్పూన్ జీలకర్ర
నాలుగు టమాటాలు
మూడు గోంగూర కట్టలు
మూడు రెమ్మల కరివేపాకు
ఒకటిన్నర టీ స్పూన్ పసుపు
రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం:
ముందుగా స్టవ్ పై ఓ మందపాటి కళాయిని పెట్టుకుని అందులో నూనె వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుని మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెంతులు మినప్పప్పు వేసి వాటిని కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటన్నిటిని సపరేటుగా ఒక్కొక్క గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కళాయిలు మరికొద్దిగా నూనెను వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత జిలకర ధనియాలు వేయించుకొని పక్కన పెట్టాలి. తర్వాత మరికొంత నూనె వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటో ముక్కలు తగినంత చింతపండు గోంగూర ఆకును వేసుకొని 20 నిమిషాల పాటులో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

టమాటో ముక్కలు మెత్త పడ్డ తర్వాత వాటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు అందుబాటులో ఉంటే రోల్ లేదా మిక్సీ జార్ ని తీసుకొని అందులో మొదటగా వేయించిన ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని.. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే మగ్గించిన గోంగూర ఆకు, టమాటో మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా పచ్చడిలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, పోపు దినుసులతో తాలింపు పెట్టుకొని గ్రైండ్ చేసిన పచ్చడి మిశ్రమంలో ఈ పోపును కలపాల్సి ఉంటుంది. అంతే సులభంగా టమాటో గోంగూర రోటి పచ్చడి తయారైనట్లే.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News