White Hair To Black Hair: యువతలో తెల్ల జుట్టు రావడానికి కారణాలు, రాకుండా ఉండడానికి పాటించాల్సిన టిప్స్‌!

White Hair To Black Hair: తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలు కూడా ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2024, 04:33 PM IST
White Hair To Black Hair: యువతలో తెల్ల జుట్టు రావడానికి కారణాలు, రాకుండా ఉండడానికి పాటించాల్సిన టిప్స్‌!

 

White Hair To Black Hair: మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె సమస్యలతో పెరగడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా అతిగా పెరుగుతున్నాయి. చాలా మందిలో చిన్న వయసులోనే జుట్టు రాలడమే కాకుండా తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో పాటు కొంతమందిలోనైతే సులభంగా బట్టల సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధానంగా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు అతిగా హెన్నా, డైలను వినియోగిస్తున్నారు. 

అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందినప్పటికీ మళ్లీ మళ్లీ ఈ తెల్ల జుట్టు సమస్య బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొదండానికి జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి గల కారణాలేంటో, ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పాటించాల్సి జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెల్ల జుట్టు రావడానికి కారణాలు:
హార్మోన్ల లోపం:

కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొంతమందిలో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. 

వంశపారంపర్యంగా..
ప్రస్తుతం చాలా మందిలో చిన్న వయసులోనే మధుమేహం లాగే  జుట్టు సమస్యలు కూడా వంశపారంపర్యంగా వస్తున్నాయని ఆర్యోగ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఇంతక ముందు వంశపారంపర్యంగా జుట్టు రాలడం ఉంటే భవిష్యత్‌ తరాల వారికి కూడా జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. 

వీటి వల్ల కూడా జుట్టు సమస్యలు వస్తాయి:
✾ధూమపానం చేయడం
✾ఒత్తిడి
✾రసాయనాలు కలిగిన హెయిర్‌ ప్రోడక్ట్స్‌ వినియోగించడం 
✾అతిగా ఎండగలో తిరగడం

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

తెల్ల జుట్టు రాకుండా ఎలా రక్షించుకోవాలి:
కొంతమందిలో తెల్ల జుట్టు రావడానికి శరీరంలోని విటమిన్‌ లోపమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో విటమిన్ బి12 స్థాయి తగ్గడం కారణంగా ఈ తెల్ల జుట్టు వస్తోంది. కాబట్టి విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. దీంతో పాటు క్రమం తప్పకుండా ఆహారంలో గుడ్లతో పాటు అవకాడో, అవిస గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. 

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News