How To Keep Away Snakes From Your House: అడవుల్లో ఆహారాలు తగ్గిపోవడం వల్ల జంతువులు, పాములు జనావాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో జీవనం గడిపేవారికి ఇవి పెద్ద సవాలుగా మారాయి. నిత్యం పదుల సంఖ్యలో పాములు జనాలు నివసించే ప్రాంతాల్లోకి సంచారం చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని జనాలకు హాని కూడా కలిగిస్తున్నాయి. దీంతో చాలా మంది వీటి నుంచి రక్షణ పొందడానికి చంపేస్తున్నారు. మరి కొంతమందైతే మన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగమని పాములను పట్టుకుని ఇతర సురక్షితమైన ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఏది ఏమైన పాములకు రక్షణ లేకుండా పోతోంది.
ప్రస్తుతం పాములు అడవి ప్రాంతాల్లో జీవించే చాలా మంది ఇళ్లలోని తరచుగా వస్తున్నాయి. కొండ పరివాహాక ప్రాంతాల్లో జీవితంచే జనావాసాల్లోకి ఎక్కువగా ప్రమాదకరమైన పాములు వస్తున్నాయి. కాబట్టి వీటిని విముక్తి పొందడానికి చాలా మంది వివిధ రకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమందైతే రసాయాలతో కూడా ప్రోడక్ట్స్‌ను అతిగా వినియోగిస్తున్నారు. వీటిని వాడడం వల్ల ఇతర జంతువులకు కూడా హానికలుగుతోంది. అయితే పాములు ఇళ్లలోకి సంచారం చేయకుండా కొన్ని సహాజమైన చిట్కాలను తెలుసుకోబోతున్నాం..వీటిని వినియోగించడం వల్ల పాములు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. ఆ చిట్కాలేంటో వాటికి సంబంధించిన పూర్తివివరాలు తెలుసుకోండి.
పాములకు కొన్ని వాసనలంటే అస్సలు ఇష్టముండదు. కాబట్టి వాటిని వినియోగించి కూడా పాములను ఇళ్లకు దూరంగా ఉంచవచ్చు. దీని కోసం ఇంటి ముందు లేదా ఇంటి వెనకాలో ఉన్న పెరట్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, నక్కల మిరియాలు, మినుముల మొక్కలను నాటడం కూడా చాలా మంచిది. అంతేకాకుండా వాటన్నింటిని ఒక తెల్లని కటన్ టవల్లో వేసి, ఒక ముడుపులా కట్టుకుని ఇంటి ముందు దర్వాజకు కట్టడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వీటన్నింటిని కలిపి స్ప్రేలా తయారు చేసుకుని పిచుకారి చేసుకోవడం వల్ల కూడా సులభంగా పాముల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
ఇంటి చుట్టు కొన్ని మొక్కలను నాటడం వల్ల కూడా పాముల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పోలాల్లో పాముల బెరద ఉన్నవారు తప్పకుండా వేప, నల్ల గుమ్మడి, చామంతి మొక్కల నాటడం వల్ల కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇంటి చుట్టూ చామంతి మొక్కలను నటడం కూడా చాలా మంచిది. అంతేకాకుండా వేప మొక్కలను నాటడం వల్ల కూడా పాములు, ఇతర కీటకాలు రాకుండా ఉంటాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter