పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది మెగాస్టార్ ‘సైరా’ టీమ్. జార్జియాలో సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించే పనిలో ఉన్న మేకర్స్, ఈ షెడ్యూల్‌కి సక్సెస్ ఫుల్‌గా ప్యాకప్ చెప్పేశారు. 500 మంది పాల్గొన్న ఈ షెడ్యూల్లో సుదీప్తో పాటు విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నారు.జార్జియా నుండి వచ్చీ రాగానే RFC లో తదుపరి షెడ్యూల్ బిగిన్ చేస్తుందీ సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ కోసం RFC లో ఇప్పటికే భారీ సెట్ నిర్మించే పనిలో ఉంది సైరా టీమ్. డిసెంబర్ వరకు జరగనున్న ఈ భారీ షెడ్యూల్‌తో దాదాపు 90% ‘సైరా’ చిత్రం తెరకెక్కినట్టే అని తెలుస్తుంది. నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్.
రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న "సైరా" చిత్రం పై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ‘యుద్ధానికి అంతా సిద్ధం’ అంటూ ట్వీట్ చేసిన సురేందర్‌రెడ్డి.. యాక్షన్ బిగిన్ అని ట్యాగ్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం 40 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో పాటు.. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను తెరకెక్కించడం జరుగుతోంది.
‘సైరా’ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచా సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు నిర్మాతలు. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉన్నా.. ఆ తర్వాత ఆయన డేట్స్ కుదరకపోవడం వల్ల తప్పుకోవడం జరిగింది.