Vastu Shastra: పొరపాటున కూడా అక్వేరియంను ఈ దిశలో పెట్టకండి.. డబ్బు సమస్యలు పెరుగుతాయట..

Vastu Shastra: ఇంటి అలంకరణతోపాటు వాస్తు ప్రకారం కూడా ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. ఫిష్ ట్యాంక్ ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అక్వేరియంలో ఉంచే చేపల సంఖ్య కూడా నియమాలు ఉన్నాయి. వాటికి అనుకూలంగా పెట్టుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 25, 2024, 05:34 PM IST
Vastu Shastra: పొరపాటున కూడా అక్వేరియంను ఈ దిశలో పెట్టకండి.. డబ్బు సమస్యలు పెరుగుతాయట..

Vastu Shastra: ఇంటి అలంకరణతోపాటు వాస్తు ప్రకారం కూడా ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. ఫిష్ ట్యాంక్ ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అక్వేరియంలో ఉంచే చేపల సంఖ్య కూడా నియమాలు ఉన్నాయి. వాటికి అనుకూలంగా పెట్టుకోవాలి.

వాస్తు ప్రకారం అక్వేరియం వంటగది లేదా బెడ్ రూంలో అస్సలు పెట్టకూడదు. దీంతో ధననష్టం వాటిల్లుతుంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో గొడవలకు కూడా దారితీస్తుందట.

ఇంట్లో అక్వేరియం ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేపలకు ఫుడ్ పెడితే కూడా వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు సంక్షోభం నుంచి బయటపడతారు.

ఇదీ చదవండి: Vastu Tips: రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తే ఏం జరుగుతుంది? ఏం చేయాలి?

అయితే, వాస్తు ప్రకారం అక్వేరియం అంటే నీళ్లు కాబట్టి దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వీటిని దక్షిణ దిశలో పెట్టకూడదు. ముఖ్యంగా అక్వేరియంలో ఎరుపు, నలుపురంగు చేపలను పెడతారు.

ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపు అక్వేరియం ఉంచితే దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుందని జోతిషులు చెబుతున్నారు.

మరో దిశ తూర్పు దిశలో ఉన్న అక్వేరియంలో చేపలను ఉంచినట్లయితే మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

ఇదీ చదవండి: Magha Purnima 2024: మాఘ పౌర్ణమి 2024 ప్రత్యేకత, విశిష్టత, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు..

కానీ, తప్పుడు దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం తప్పదు. వాస్తు ప్రకారం అక్వేరియం ఉత్తర దిశలోనే పెట్టుకోవాలి. దీంతో మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాదు ఉత్తర దిశ అంటే కుబేర దిశ. ఈ దశలో ఏర్పాటు చేసుకోండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News