Ram Charan: ఉపాసన పాదాలు పట్టుకున్న రామ్ చరణ్.. వీడియో వైరల్..

Ram Charan-Upasana: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. సినిమాలతోనే కాదు తన పర్సనల్ లైఫ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చే ఈ హీరో ప్రస్తుతం ఉపాసనతో షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2024, 04:13 PM IST
Ram Charan: ఉపాసన పాదాలు పట్టుకున్న రామ్ చరణ్.. వీడియో వైరల్..

Ram Charan Viral Video
ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. ఫ్యామిలీతో తనకు ఉండే అనుబంధం ద్వారా కూడా సోషల్ మీడియాలో మెరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపాసనతో రామ్ చరణ్.. ఫోటోలు.. వీడియోలు ఎప్పుడు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీరిద్దరూ కలిసి షేర్ చేసే పోస్టులు భార్యాభర్తల బంధం ఎంత క్యూట్ గా ఉంటుందో ఇప్పటికే అనేక సార్లు తెలియజేశాయి. తాజాగా చరణ్, ఉపాసనల క్యూట్ వీడియో మరొకటి వైరల్ అవుతుంది. 

అసలు విషయానికి వస్తే గుజరాత్ లో జరిగిన అనంత్ అంబానీ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చరణ్ – ఉపాసన కూడా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లారు. ఈ ఈవెంట్ కి గాను చరణ్, ఉపాసన ఓ ప్రైవేట్ జెట్ లో వెళ్లారు. ఈ ఫ్లైట్లో వీరిద్దరూ తీసుకున్న ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.

రామ్ చరణ్, ఉపాసన ఫ్లైట్ లో వెళ్తుండగా ఉపాసన కాళ్ళు నొప్పెట్టాయేమో, ఉపాసన తన కాళ్ళని రామ్ చరణ్ మీద పెట్టగా.. వెంటనే రామ్ చరణ్ ఉపాసన పాదాల్ని ఒత్తుతూ, మసాజ్ చేస్తూ.. తన భార్య రిలాక్స్ అయ్యేలా చేసాడు.

 

ఇక వెంటనే ఈ లవ్లీ వీడియోని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ వీడియోని ప్రస్తుతం మెగా అభిమానులు తెగ షేర్ చేస్తూ రాంచరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎంత స్టార్ హీరో అయినా భార్యకు దాసుడే అంటూ కొంతమంది సరదా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ద్వారా మరోసారి క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరి జంట.

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తరువాత చిరంజీవి ఆచార్యాలో కనిపించిన ఈ హీరో ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజెర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదల తేది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి కి విడుదల కానుంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ప్లాన్ చేస్తున్నారు.

Also ReadMango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..

Also ReadSnake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News