Tips For Healthy Travelling: ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే అదో గతే!

Tips For Staying Healthy While Travelling: మనలో చాలా మందికి ట్రిప్‌లకు వెళ్లడం అంటే ఎంతో నూతనోత్సహం కలుగుతుంది. అయితే చాలా మంది ట్రిప్‌లకు వెళ్లతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2024, 09:55 PM IST
Tips For Healthy Travelling: ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే అదో గతే!

Tips For Staying Healthy While Travelling: కొత్త ప్రదేశాలను చూడాలి అనుకొనేవారు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తినడం, వాతవరణం మార్పులు ఇతర కారణాల వల్ల మనం కొన్ని సార్లు అనారోగ్యాల సమస్యల బారిన పడుతుంటాము. అయితే  ఈ సారి మీరు ట్రిప్‌కు ప్లాన్‌ చేసినప్పుడు ఈ జాగ్రతాలను పాటించండి.

ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు:

గమ్యస్థానం ఎంచుకోండి: 

మొదటగా మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంచుకోండి.

ఆన్‌లైన్‌లో పరిశీలించండి: 

మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించండి 

Also Read: Search By Date Feature: వాట్సాప్​ 'సెర్చ్​ బై డేట్' ఫీచర్‌తో మీ పని సులభంగా అవుతుంది!

ఆహారం:

ప్యాక్ చేసిన ఆహారం మీద ఆధారపడకండి: 

ఎక్కువగా వేయించిన ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం నివారించండి.

పండ్లు, కూరగాయలు, గింజలు: 

వీటిని ఎక్కువగా తీసుకోండి. ఇవి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను సులభం చేస్తాయి.

బాటిల్డ్ వాటర్: 

బయట తాగే నీటిపై నమ్మకం లేకపోతే, సురక్షితమైన బాటిల్డ్ వాటర్‌ని తీసుకువెళ్లండి.

మీ బడ్జెట్‌ను నిర్ణయించండి: 

బుక్ చేసుకోండి: 
 
ఖర్చుల కోసం ముందుగానే బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి.

పరిమాణంలో భోజనం: 

ఎక్కువగా తినడం వల్ల అలసట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తినండిని మితంగా తీసుకోండి. 

నీరు ఎక్కువగా తాగండి : 

ప్రయాణంలో శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి  రోజు అంతా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండండి.

సరిపడా నిద్ర: 

ప్రయాణంలో నిద్రపోవడం కష్టం అనిపించినా, సాధ్యమైనంత వరకు 8 గంటల నిద్ర తీసుకోవడానికి ప్రయత్నించండి.

క్రమం తప్పకుండా వ్యాయామం:

ప్రయాణంలో కూడా కొన్ని నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

శుభ్రత: 

బయట తిరిగిన తర్వాత తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి. సానిటైజర్ వాడండి.

మందులు: 

మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, అవసరమైన మందులు వెంటనే తీసుకువెళ్లండి.

మీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చిట్కాలు సహాయపడతాయి. ఎలాంటి ఇబ్బందుల బారిన పడకుండా మీరు మీ ట్రిప్‌ను అనందంగా గడుపుతారు. 

ఈ విధంగా మీరు టిప్స్‌ను పాటించడం వల్ల మీ ట్రిప్‌ ఎంతో హాయిగా జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యంగా ఎక్కువగా మహిళలకు, పిల్లలకు ఎంతో ఉపయోగపడుతాయి.

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News