Brahmamudi Today March 7 Episode: నేడు మార్చి 7 ఎపిసోడ్‌లో రాజ్ భాస్కర్‌ను స్నానానికి తీసుకెళ్తుంటాడు. వారి మధ్య మాటలు రసవత్తరంగా సాగుతాయి. భాస్కర్ స్నానం చేస్తూ బోర్ కొడుతుంది పాట పడమని రాజ్ ను అడుగుతాడు. నాకు పాట రాదు నువ్వే పడుకో అంటాడు. దీంతో దసరాబుల్లోడు సినిమాలోని చేతిలో చెయ్యేసి చెప్పు బావా.. అని పాట పాడుతాడు.. ఆ తర్వాత డ్రాయర్, బనీన్ కావాలి బుజ్జీ అని పిలుస్తాడు. నేనే తెస్తా అని రాజ్ చివరకు భాస్కర్ ఇన్నర్లను తీసుకువస్తాడు. ఇక స్నానపు గదిలోపలి నుంచి రాజ్ ను భాస్కర్ ఆటపట్టిస్తూనే ఉంటాడు.
మరోవైపు దుగ్గిరాల వారింట్లోనే మోడలింగ్ ఫోటోషూట్ మొదలెడుతుంది స్వప్న. ఇది చూసిన రుద్రాణీ ఎంత పొగరు లేకపోతే ఇంట్లోవాళ్లు వద్దన్న పనిచేస్తావు అని ప్రశ్నిస్తుంది. మీ కొడుకు నువ్వు ఈ ఇంట్లో అడుక్కుతింటున్నారు. నా సంపదన నా బతుకు నేనే చూస్కుంటున్నాను అంటుంది స్వప్న. దీంతో ఇంట్లోకి పరిగెత్తిన రుద్రాణీ ఇంటి సభ్యుల అందరినీ కేకలు వేస్తూ బయటకు తీసుకువస్తుంది. అందరూ స్వప్న ఫోటోషూట్ చూస్తూ ఆశ్చర్యపోతారు. ఇక ధాన్యలక్ష్మి అక్క.. ఇంటి గుట్టు అని మాకు అందరికీ నీతులు చెబుతావు కదా.. అని హేళన చేస్తుంది అపర్ణను. అప్పుడు రాహుల్ మామ్.. మనకు ఏంటీ సినిమా అంటాడు. దీనికి తీసుకువచ్చి నా నెత్తి మీద పెట్టి నన్నడుగుతావు ఏంట్రా? అంటుంది. దీనికి దీనికి రాజ్ నాన్న ఫోటోషూట్ పూర్తవ్వని అదేందో స్వప్నని అడిగి తెలుసుకుందాం అంటాడు.
ఈలోగా కనకం ఇంట్లో అందరూ టీ తాగుతుంటారు. లోలోపల కావ్య భాస్కర్లను చూసి తిట్టుకుంటూ ఉంటాడు. మా అమ్మ చేసిన ఇడ్లీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది బావ ఓసారి ఆ.. పట్టు అంటుంది. దీనికి ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ వాళ్లను కాళ్లు విరగొడతాను, మొహం చట్నీ చేస్తాను అని డిస్ట్రబ్ చేస్తూంటాడు. దీనికి ఏమైందండి? అని కావ్య అడుగుతుంది. అవతల ఆఫీసులో కొంపలంటుకుంటున్నాయి అంటాడు. పదపద ఇంట్లో ఉన్నవారు చూసుకుంటారు అని హడావుడిగా లాక్కెళ్తాడు రాజ్. ఇక బుజ్జీ, బావా అంటూ డ్రామాటిక్ ప్రేమను పండిస్తారు.. ఇది భలే వర్కౌట్ అవుతుంది.
కావ్యరాజ్ లు కూడా దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. కార్లోంచి దిగి స్వప్న ఫోటో షూట్‌ను చూస్తారు. ఈలోగా షూట్ పూర్తవుతుంది. ఇంట్లోకి వస్తున్న స్వప్నను ఆగు.. ఇక్కడ అందరూ నీ ఫ్యాషన్ షో చూసి చప్పట్లు కోడదామనుకున్నారు అనుకుంటున్నావా? వీళ్లందరికీ జవాబు చెప్పు అంటుంది రుద్రాణీ. ఏదైనా చేసే ముందు పెద్దల నిర్ణయం తీసుకోవాలని తెలవదా అంటుంది అపర్ణ. డబ్బు అసరం ఉంది అంటుంది స్వప్న. ఈ ఇంట్లో నీకు డబ్బు లోటుందా? అంటాడు కావ్య మామ. దీంతో అవును నాకు కావలంటే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలట మా అత్త మొగుడు అడుక్కుతింటున్నారు ఇక్కడ అంటుంది. దీనికి ధాన్యలక్ష్మి అదేంటి రుద్రాణీ పుట్టింటి నుంచి తెచ్చుకో అన్నావా? వాళ్లే ఈ ఇంటిపై పడి తింటుంటారు అని హేళన చేస్తుంది. దీనికి కావ్య ఎవరు ఎవరినీ దోచుకుతినడం లేదు వాళ్ల కష్టంతో వాళ్లు బతుకుతున్నారు అంటుంది. మరి అప్పును ఎందుకు ఎర వేసి కల్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని ప్రశ్నిస్తుంది. రాజ్ కూడా అనామికను ఈ విషయమై కోప్పడతాడు.
ఇదీ చదవండి: Brahmamudi Today March 5th Episode: బుజ్జీప్లాన్ సక్సెస్.. గింజుకుంటున్న మిస్టర్ బడాయి..
ఇక అమ్మమ్మ స్వప్న ఏంటమ్మా ఇది. నీ సంపదన నువ్వే చూసుకోమని ఎవరు చెప్పరు. భర్త, అత్త పట్టించుకోకపోతే ఏం చేయాలి? అని స్వప్న ప్రశ్నిస్తుంది. నా భర్త , అత్త నాకేం సంబంధం లేదని చేతులు దులుపేసుకున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పట్టుబోయే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద ఇంట్లో నా కనీస అవసరాలు కూడా తీర్చలేని మనిషే లేరు. ఇదేంటని ప్రశ్నించే అధికారం నా భర్తకు అత్తకు లేదు అంటుంది. మరి మేమున్నాం కదా అంటాడు రాజ్ నాన్న. దీంతో రాజ్ నీభార్య భాద్యతను ఎందుకు తప్పించుకుంటావు అంటుంది. దీంతో అపర్ణ కూడా స్వప్నను సమర్థిస్తుంది. కనీసం వాళ్ల వారసుడిగా నా బిడ్డను గుర్తిస్తారని నాకు అనిపించడంలేదు. వీళ్లకు నేనేందుకు సమాధానం చెప్పాలి అంటుంది. రాజ్ నాన్న కూడా రుద్రాణీని ప్రశ్నిస్తాడు. ఇక రుద్రాణీ కూడా అటూ ఇటూ తిప్పి రాజ్ బిజినెస్ వద్దకే వస్తుంది. రాహుల్ గాలి తిరుగుళ్లకు బిజినెస్ సెట్ కాదు ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పు అంటాడు రాజ్ నాన్న సుభాష్.చేతులు దులుపేసుకుని కూర్చుంటే సరిపోదు మాకు చెప్పాలి కదా అని రుద్రాణీని నిలదీస్తుంది అపర్ణ. ఇక్కడితో ఆపు మావరకు వచ్ఇంది కదా అని ఇందిరా దేవి అందరినీ ఇంట్లోకి తీసుకెళ్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter