IND vs ENG 5th Test Latest Updates: ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈసారి స్టోక్స్ సేన ఒక మార్పుతో, భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దాగాయి. బ్యాటర్ రజిత్ పాటిదార్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో స్టార్ పేసర్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఆల్ రౌండర్ రాబిన్సన్ బదులు స్టార్ పేసర్ మార్క్ వుడ్ ను టీమ్ లోకి తీసుకుంది ఇంగ్లండ్ టీమ్. ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్, ఇంగ్లండ్ స్టార్ ఫ్లేయర్ జానీ బెయిర్‌స్టోకు ఇది వందో మ్యాచ్ కావడం విశేషం.
Also Read: AP Elections 2024: ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు, జాబితా ఇదే
ధర్మశాల వేదికగా 2017లో తొలిసారి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ జరగలేదు. ధర్మశాలలో మంచు ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కడపటి వార్తలు అందే సమయానికి ఇంగ్లండ్ 11 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 37 పరుగులు చేసింది. క్రాలే 24, బెన్ డకెట్ 12 పరుగులతో ఆడుతున్నారు.
A look at #TeamIndia's Playing XI for the 5th and final #INDvENG Test!
Devdutt Padikkal makes his Test Debut 👏👏
Follow the match ▶️ https://t.co/OwZ4YNua1o@IDFCFIRSTBank pic.twitter.com/TvFY7L9CjB
— BCCI (@BCCI) March 7, 2024
భారత జట్టు: యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి