How To Make Fruit Salad Recipe At Home: ఎండాకాలంలో సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలయితే తరచుగా ఐస్ క్రీమ్ కావాలని అడుగుతూ ఉంటారు. అయితే బయట లభించే ఐస్ క్రీమ్స్ ఇతర పానీయాలు పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం. కాబట్టి వేసవికాలంలో వీటిని పిల్లలకి ఇవ్వడం అంత మంచిది కాదు. అంతేకాకుండా చాలామంది పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రూట్స్‌తో తయారు చేసిన ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ కస్టడ్స్ ఇంట్లోనే తయారుచేసి సాయంత్రం పూట స్నాక్స్‌గా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రూట్ సలాడ్స్ లో పండ్ల ముక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పిల్లలకు ఇవ్వడం ఎంతో మంచిది. సాయంత్రం పూట తక్కువ కస్టర్డ్ పొడిని వినియోగించి పిల్లలకు వివిధ రకాల పనులతో తయారుచేసిన ఫ్రూట్ సలాడ్స్‌ను ఇవ్వడం వల్ల శరీరం కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ సమ్మర్ మీ పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్‌గా ఫ్రూట్ సలాడ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసే పద్ధతిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం.
కావలసిన పదార్థాలు:
❁ 6 రకాల పండ్లు - రెండు కప్పులు
❁ నిమ్మరసం (Lemon Juice): 1 టేబుల్‌స్పూన్
❁ గ్రాన్యులేటెడ్ చక్కెర (Granulated Sugar): రుచికి తగినంత
❁ కస్టర్డ్ పొడి (Custard Powder): 2 టేబుల్‌స్పూన్లు
❁ పాలు (Milk): కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కోసం
తయారు చేసే విధానం:
❁ ముందుగా మీకు కావాల్సిన పరిమాణంలో మామిడి, అరటిపండు, ద్రాక్ష, కివి వంటి రుచికరమైన పండ్లు చేసుకోవాల్సి ఉంటుంది
❁ ఒక బౌల్ తీసుకొని అందులో అన్ని పనులను కట్ చేసిన ముక్కలను మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
❁ ఈ పండ్ల మొక్కలను దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు కలపడం వల్ల వాటిలో నుంచి ఫ్లేవర్స్ బయటికి వస్తాయి.
ఆ తరువాత ఇదే పనుల మిశ్రమంలో తగినంత నిమ్మరసాన్ని కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు పండ్ల ముక్కలను బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
❁ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత గ్రాన్యులేటెడ్ చక్కెరను వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
❁ ఆ తర్వాత పాలు, కస్టర్డ్ పొడిని మరో గిన్నెలో బాగా మిక్స్ చేసుకొని సన్నని మంటపై ఉండలు లేకుండా మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
❁ ఇలా తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమంలో ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న పండ్ల ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
❁ ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకొని రెండు గంటల తర్వాత దాని పైనుంచి డ్రై ఫ్రూట్స్‌ను గార్నిష్ చేసి తీసుకుంటే రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ అయినట్లే.
చిట్కాలు (Chef's Tips):
❁ పండ్లను ముక్కలుగా కోయడానికి ముందు చల్లటి నీటిలో నానబెట్టడం వల్ల అవి గట్టిగా ఉంటాయి. అంతేకాకుండా వాటి నుంచి మిశ్రమం రసం కూడా బయటికి రాకుండా చక్కగా ఉంటాయి.
❁ ఈ ఫ్రూట్ సలాడ్ మరింత టేస్టీగా ఉండడానికి తప్పకుండా ఫ్రిజ్లో పెట్టి రెండు గంటల తర్వాత తీసుకోవాలి.
❁ అదనపు రుచి, టెక్స్‌చర్ కోసం వాల్‌నట్ ముక్కలను సర్వ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి