UP Bus Accident: పెళ్లి బస్సులో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవ దహనం

Ghazipur Bus Accident Latest Updates: హైటెన్షన్ వైర్‌ను పెళ్లి బస్సు ఢీకొనడంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 11, 2024, 06:52 PM IST
UP Bus Accident: పెళ్లి బస్సులో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవ దహనం

Ghazipur Bus Accident Latest Updates: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు బస్సుపై హై టెన్షన్ వైర్లు తెగిపడడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీలోని ఘాజీపూర్ జిల్లా మర్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాహర్ ధామ్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషమంగా ఉన్నవారిని చికిత్స నిమిత్తం మౌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘాజీపూర్ బస్సు అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలు ఇలా..

Also Read: AP Assembly Elections 2024: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. బీజేపీలోకి జంప్..!

మౌ జిల్లా నుంచి ఘాజీపూర్‌లోని బరేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి పెళ్లి బస్సు ఊరేగింపుగా వచ్చింది. వధూవరుల పెళ్లి మహాహర్ ధామ్ ఆలయంలో జరగాల్సి ఉంది. అయితే ఈ ఆలయంలో 3 రోజులుగా జాతర జరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రధాన రోడ్డులో కాకుండా.. మరో రోడ్డులో అధికారులు బస్సును పంపించారు. రోడ్డు సరిగా లేదని బస్సులో కూర్చున్న వధువుతో పాటు ఆమె కుటుంబానికి చెందిన కొందరు కిందకు దిగారు. కొందరు వృద్ధులు, పిల్లలు బస్సులో తీసుకుని వెళుతుండగా.. చదును చేయని రహదారిని దాటగానే హైటెన్షన్ వైరును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. 

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి బస్సులో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విద్యుత్ వైరును సరిచేయాలని  విద్యుత్ శాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి కూడా ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. మంత్రులు ఏకే శర్మ, అనిల్ రాజ్‌భర్‌లను ఘాజీపూర్ చేరుకోవాలని సూచించారు. ఘటన జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి అనిల్ రాజ్‌భర్ తెలిపారు. 

Also Read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ చదువుకున్న స్కూల్ ఇదే.. అప్పట్లో ఫీజు ఎంత చెల్లించేవారో తెలిస్తే ఫ్యూజులు అవుట్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News