Naveen Vijay Krishna: హీరోగా గుర్తింపు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న సీనియర్ నటుడు ఆరు పదుల వయసులో అనధికారికంగా నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతడి కుమారుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి పెళ్లిళ్లపరంగా.. సినిమాలపరంగా విజయం సాధిస్తుండగా హీరోగా కొడుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ సమయంలో ఓ ఇంటర్వ్యూలో అతడి కుమారుడు కీలక విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తండ్రి పెళ్లిళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు తన సినీ కెరీర్, తదుపరి లక్ష్యం వంటి వాటిపై మాట్లాడాడు. అతడే సీనియర్ వీకే నరేశ్ కుమారుడు నవీన్.
Also Read: Preethi Reddy: మల్లారెడ్డి కోడలు లవ్‌స్టోరీ ఇదే.. సినిమాలో మాదిరి ట్విస్టుల మీద ట్విస్ట్
సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను నరేశ్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ కలిగిన సంతానమే నవీన్ విజయ్ కృష్ణ. భార్యతో నరేశ్ తెగదెంపులు చేసుకున్నాడు. కానీ కొడుకుగా నవీన్‌ను నరేశ్ స్వీకరించాడు. కొడుకు నవీన్‌ను సినీ పరిశ్రమలో ప్రవేశించేందుకు సహకరించాడు. కొడుకును హీరోగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగ ప్రయత్నించాడు. ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో నవీన్ చెప్పాడు. మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై ప్రశ్న ఎదురుకాగా.. 'నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. సినిమా కెరీర్‌లో ఇంకా రాణించాల్సి ఉంది' అని తెలిపాడు. మరి మీ నాన్న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారనే ప్రశ్న రాగా.. 'అది ఆయన ఇష్టం. ప్రతి మనిషికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. దాన్ని తప్పుబట్టలేం' అని పేర్కొన్నాడు.
Also Read: Kamal Haasan : కమల్ హాసన్ సినిమా నుంచి బయటకువచ్చేసిన ఇద్దరు స్టార్ హీరోలు.. కారణం అదే!
తన తండ్రి నరేశ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు నవీన్ తెలిపాడు. ఏ విషయంలోనైనా తన తండ్రి వెనక్కి తగ్గడని, తనకు నచ్చిన పని చేస్తూనే ఉంటాడని వెల్లడించాడు. ఎవరు ఏమీ అనుకుంటారనే విషయాన్ని పట్టించుకోరని పేర్కొన్నాడు. తాను కూడా తన తండ్రి మాదిరే నచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు వదిలేసి ఎడిటర్‌గా పని చేస్తున్నట్లు తెలిపాడు. కెరీర్‌లో ఎదగడమే తన లక్ష్యమని ప్రకటించాడు.
నవీన్ విజయ్ కృష్ణ 2016లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టగా.. 'నందిని నర్సింగ్ హోమ్' సినిమాతో హీరోగా అడుగుపెట్టిన నవీన్ 'ఊరంతా అనుకుంటున్నారు', 'విఠలాచార్య', 'రెండు జెళ్ల సీత' వంటి సినిమాలు చేశాడు. 'సత్య' అనే షార్ట్‌ఫిల్మ్‌కు కూడా విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి