SBI Charges: ఖాతాదారుల నెత్తిమీద ఎస్‌బీఐ పిడుగు.. భారీగా ఛార్జీలు పెంపు ఎప్పటి నుంచంటే..?

SBI Hikes Annual Maintenance Charges For Debit Cards: వినియోగదారులకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ భారీ షాక్‌ ఇచ్చింది. చార్జీలు పెంచుతూ ఆ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. డెబిట్‌ కార్డుదారులకు నిర్వహణ చార్జీలు పెంచేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 10:56 PM IST
SBI Charges: ఖాతాదారుల నెత్తిమీద ఎస్‌బీఐ పిడుగు.. భారీగా ఛార్జీలు పెంపు ఎప్పటి నుంచంటే..?

SBI Charges Hike: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. దేశంలో ఏ బ్యాంకుకు లేనంత మంది ఖాతాదారులు ఎస్‌బీఐకి ఉన్నారు. అలాంటి బ్యాంక్‌ ఖాతాదారులపై ఓ పిడుగు వేసింది. ఎస్‌బీఐ తన డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పెరిగిన చార్జీలకు అదనంగా జీఎస్టీ కూడా ఉండడం గమనార్హం. అయితే పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్బీఐ వెల్లడించింది.

Also Read: 7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. 9 అలవెన్స్‌లు భారీగా పెంపు

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఎస్‌బీఐ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ.75 చొప్పున పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇప్పటివరకు ఏడాదికి రూ.125 ఛార్జ్ చేస్తుండగా పెరిగిన ఛార్జీల ప్రకారం ఏడాదికి రూ.200 నుంచి రూ.250 వరకు ఛార్జ్ చేసే అవాశం ఉంది. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుల్లో చాలా రకాలు ఉన్నాయి. క్లాసిక్‌, సిల్వర్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిడ్‌ కార్డులు తదితర ఉన్నాయి. వాటికి వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ.125తో కలిపితే జీఎస్టీ ఉంటుంది. ఛార్జీలతోపాటు జీఎస్టీ కలిపితే భారీగానే వినియోగదారులపై భారం పడనుంది.

Also Read: Savings Scheme: తక్కువ చెల్లింపుతో దర్జాగా నెలకు రూ.5 వేలు పొందే అద్భుత పథకం

ఎస్‌బీఐ అందించే యువ, గోల్డ్‌, కాంబో డెబిట్‌ కార్డుల నిర్వహణ రుసుములు ప్రస్తుతం రూ.175 ఉంది. దీనికి అదనంగా జీఎస్టీ ఉన్న విషయం తెలిసిందే. కొత్త చార్జీలు అమలైతే ఏప్రిల్‌ 1 తర్వాత రూ.250 చార్జీతోపాటు జీఎస్టీ కూడా ఉంటుంది. ప్లాటినమ్‌ కార్డుదారులకు రూ.250 నుంచి రూ.325కు తోడు జీఎస్టీ ఉండనుంది. ఇలా ఎస్‌బీఐ తన అన్ని డెబిట్‌ కార్డుల చార్జీలు పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక చార్జీల పేరుతో ఖాతాలో నుంచి తీసేసుకుంటున్న ఎస్‌బీఐ ఇప్పుడు యూజర్‌ చార్జీలు పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News