/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Ugadi Rasi Phalalu - Kartaka Rasi 2024 -25: తెలుగు వారు జరుపుకునే  పండుగల్లో అతి ముఖ్యమైనది ఉగాది.  ఈ రోజు నుంచే తెలుగు నూతన  సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంతం మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ ఉగాది.  సంప్రదాయాలు, సదాచారాలతో పాటూ ఆరోగ్య సూక్తులూ, మానవజీవన విలువలూ మేళవించిన అపూర్వ సమ్మేళనాలు పండుగలు. తెలుగువారికి ఇష్టమైన పండుగ ఉగాది. కోయిల పాటే ఉగాది. చెట్ల చిగురే ఉగాది. షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది. వసంతాగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది. తెలుగు వారి ఆత్మీయబంధానికి ప్రతీక.   ఈ క్రోది నామ సంవత్సరంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. అందులో 4వ రాశి అయిన కర్కాటకం వారికీ ఈ సారి ఎలా ఉండబోతుందో చూద్దాం..

కర్కాటకం.. పునర్వసు -4, పుష్యమి, ఆశ్లేష..
కర్కాటక రాశి వారికీ ఈ యేడాది ఆదాయం .. 14.. వ్యయం.. 2 .. రాజపూజ్యం -6.. అవమానం - 6 ఉంది.

ఈ రాశి వారికి అష్టమంలో శని దేవుడు ఉన్నా.. పెద్ద ఇబ్బంది కలిగించడు. ఈ రాశి వారిక విద్య, ధనము, బుద్ది, సంతానముకు కారకుడైన గురుడు ఏకాదన స్థానంలో   ఉండటం వలన ఎలాంటి కష్టమైనటు పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి వారు తమ శక్తికి మించిన సామర్ధ్యముతో పనిచేస్తారు. సంఘంలో గౌరవ మన్ననలు పొందుతారు. విద్యార్ధులు విద్యా యోగం ఉంది. మరోవైపు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న గృహ  నిర్మాణ  పనులు ఊపందుకుంటాయి. బంధు వర్గంలో మీకు మంచి పలుకుబడి వస్తోంది. అన్ని రంగాల్లో ఉన్న ఈ రాశుల వారికీ రాజ్య పూజ్యత, అదృష్టం కలిసొస్తోంది. వ్యాపర రంగాల వారికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు  చూస్తోన్న విదేశీ యాన యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు తీర్ధయాత్రలతో సాంత్వన పొందుతారు. వాహన యోగం ఉంటుంది. ఎంతో కాలంగా పెళ్లి కానీ ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ యేడాది పెళ్లి యోగం ఉంది. జీవితంలో సంతృప్తి, మనశ్శాంతి, కర్కాటక రాశి వారికీ పుష్కలంగా ఉంటాయి.

ఈ యేడాది ప్రభుత్వ ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలం అని చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేసే వారికీ బదిలీలు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. టెంపరరీ ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులకు మంచి కాలమే అని చెప్పాలి. అధిష్ఠానంలో ప్రత్యేక గుర్తింపు వస్తోంది. పార్టీలో కీలక పదవులు లభిస్తాయి. గ్రామాల్లో నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సినీ రంగానికి చెందిన వారికీ మంచి అవకాశాలు లభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న సక్సెస్ కూడా గురు బలం వల్ల కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన కాలము. ఎంతో కాలంగా చూడని లాభాలను చవిచూస్తారు. వ్యవసాయదారులు రెండు పంటలు కలిసొచ్చను. మరోవైపు ఋణ బాధల నుంచి విముక్తి పొందుతారు. విద్యార్ధులకు అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉంది.  ఈ రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. సంతానం వలన సౌఖ్యం, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. దీని పరిహారానికి గురు, శని, రాహు గ్రహ శ్లోకాలు పఠించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు.

Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ugadi Rasi Phalalu - Kartaka Rasi 2024 -25 Kartaka Rasi Full Predictions details ta
News Source: 
Home Title: 

Ugadi Rasi Phalalu Kartaka Rasi 2024 -25: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది.. ?

Ugadi Rasi Phalalu Kartaka Rasi 2024 -25: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది.. ?
Caption: 
Karkataka Rasi Phalalu (X/Source)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Ugadi Rasi Phalalu : శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది.. ?
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Sunday, April 7, 2024 - 07:38
Created By: 
Kiran Kumar
Updated By: 
Krindinti Ashok
Published By: 
Kiran Kumar
Request Count: 
44
Is Breaking News: 
No
Word Count: 
409