Vijay Devarkonda slaps Mrunal:
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పేరు తెచ్చుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం… పెళ్లిచూపులు సినిమాల ద్వారా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. యాక్టింగ్ పరంగా ఈ హీరోకి వంక పెట్టె అవసరం లేదు. కానీ ఈ హీరో యటిట్యూడ్ మాత్రం ప్రస్తుతం పెద్ద డిస్కషన్ గా మారుతోంది.
బయట కొంచెం అవసరమైన దానికన్నా కూడా ఎక్కువగా ప్రవర్తించే విజయ్ దేవరకొండ.. తన సినిమాల్లో కూడా అవసరానికి మించిన సీన్స్ లో నటిస్తూ ఉంటాడు. విజయ దేవరకొండ బయట ప్రవర్తించే తీరు ఎన్నోసార్లు చర్చలకు దారి తీసింది. కొంతమంది ఆయన పైన ప్రశంసలు కురిపిస్తే.. ఎంతోమంది విమర్శలు కురిపించారు. అయినా తన తీరు ఏమాత్రం మారలేదు. ముఖ్యంగా లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో యటిట్యూడ్ తో కనిపించాడు ఈ హీరో. ఇక ఆ సినిమా కాస్త డిజాస్టర్ గా మిగిలింది.
విజయ్ దేవరకొండ బయట తీరు పక్కన పెడితే.. ఆయన సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా అవసరమా అన్నట్టు అనిపించక మానవు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ ని ఆవేశంగా కొట్టేసి వెళతాడు విజయ్. అప్పట్లో ఆ సీన్ ఎన్నో చర్చలకు దారితీసింది. అయితే ఆ చిత్రంలో హీరో క్యారెక్టర్ చూపివ్వడానికి అలా పెట్టాము అని సధి చెప్పుకున్నారు.
కట్ చేస్తే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ లో కూడా ఇంట్రవెల్ కి ముందు హీరోయిన్ ని కొడతారు విజయ్. కాలేజీలో తన ఫ్రెండ్స్ అందరి ముందు హీరోయిన్ ని కొత్తడమే కాకుండా తన పైన బుక్కు కూడా విసిరేస్తారు. అది కూడా కేవలం హీరోయిన్ తనపైన ఒక బుక్ రాసింది అన్న కోపంతో. అక్కడ కోప్పడడానికి కారణం ఉన్న.. ఒక అమ్మాయిని అందరి మధ్య కొత్తడమనేది ఎంతవరకు కరెక్ట్? దానికి తోడు.. హీరోయిన్ ఆ విషయం పైన కోప్పడకుండా సెకండ్ హాఫ్ మొత్తం హీరో ఏం చేసినా సహిస్తుంది. అసలు దర్శకుడు ఇలాంటి కథ ఎలా రాసుకున్నాడు? అలాంటి అబ్బాయిని హీరోయిన్ ప్రేమించింది అంటే కనీసం కారణమన్నా ఉండాలి. ఆ కారణం కూడా మనకి సినిమాలో ఎక్కడా చూపివ్వరు. పోనీ తన ఫ్యామిలీ కోసం తాను నిలవడం వల్ల హీరోయిన్ ప్రేమించిందా అని అనుకుంటే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలామంది అలానే ఉంటారు. కాబట్టి అక్కడ విజయ్ గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు.
మరోపక్క ప్రస్తుతం తెలుగు హీరోలు ఎవరు ఇలా హీరోయిన్ కొట్టే సన్నివేశాలు చేయడం లేదు. అందుకు ముఖ్య కారణం అలాంటి సీన్స్ తమ సినిమాల్లో పెట్టడం ద్వారా ప్రేక్షకులకి తాము ఏమి చెప్పబోతున్నాము అని ఆలోచించడమే. మరి ఆ ఆలోచన విజయ్ కి ఎందుకు రావడం లేదు. విజయ్ దేవరకొండని అభిమానించేవారు హీరోయిన్ ని కొట్టడం హీరోయిజం అనుకుంటే అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది?
కనీసం దర్శకుడు అక్కడ హీరో కోప్పడినట్టు చూపించి ఆపేసి ఉన్న బాగున్ను. దర్శకుడు చెప్పాలి అనుకునింది ఒక వ్యక్తి చంపపై మనం కొడితే ఆ కోపం తగ్గిపోతుంది అన్న పాయింట్ అయి ఉండొచ్చు.. కానీ ఎంత వెనకేసుకొని వచ్చినా అంత మంది ముందర ఒక అమ్మాయిని హీరో చేయి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది ఒపీనియన్. అంతేకాకుండా ఫస్ట్ అఫ్ లో కూడా విజయ్ తన వదినను కాపాడిన తర్వాత విలన్ తో మాట్లాడే డైలాగ్ చాలా వల్గర్ గా ఉంటుంది. అసలు అలాంటి సన్నివేశాలు ఫ్యామిలీ స్టోరీ లో ఎందుకు పెట్టారో దర్శకుడికే అర్థం అవ్వాలి.
విజయ్ దేవరకొండ గీతాగోవిందం లాంటి సినిమాలో హీరోయిన్ కోసం కాళ్ళ మీద పడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలానే ఫ్యామిలీ స్టార్ లో చివర్లో హీరోయిన్ దగ్గర కొట్టించుకునే సన్నివేశం కూడా ఉంది. అలా అని మరి అతివృష్టి.. అనావృష్టిగా ప్రవర్తించి.. తన సినిమాల్లో ఇలాంటి సీన్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇదే విషయం విజయ్ ఆలోచించి ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటే మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
హీరోయిన్ ని కొట్టడం హీరోయిజమా? విజయ్ దేవరకొండ మారకపోతే కష్టమే!