Ladies Finger Good For Diabetes: బెండకాయ షుగర్ పేషెంట్లకు చాలా మంచి ఆహారం. దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. బెండకాయలో నీరు, ఫైబర్, పోషకాలు పుష్కలంగా లాభిస్తాయి. ఇవి షుగర్ పేషెంట్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. దీని వల్ల కలిగే మరి కొన్ని లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
షుగర్ పేషెంట్లకు బెండకాయ తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:
బెండకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. షుగర్ పేషెంట్లకు ఇది మంచి ఆహార ఎంపిక. దీని మీరు కూర లేదా ఇతర వంటకలు తయారు చేసుకొని తినవచ్చు. అంతేకాకుండా బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. అలాగే షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పెక్టిన్ పదార్థం కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
బెండకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులును తగ్గించడంలో మేలు చేస్తుంది. అలాగే అధిక బరువు పెరగకుండా ఉంచడంలో ఈ బెండకాయాలు ఎంతో సహాయపడుతాయి. బెండకాయను వివిధ రకాలుగా తినవచ్చు. వాటిని సూప్, కూరలు, కూరగాయల వేపుడు, లేదా సలాడ్లలో వాడవచ్చు. బెండకాయ ఒక పోషకమైన రుచికరమైన కూరగాయ, ఇది షుగర్ పేషెంట్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బెండకాయ గింజలను కూడా తినవచ్చు, వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
బెండకాయ షుగర్ నియంత్రణలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు 12 వారాల పాటు రోజుకు 100 గ్రాముల బెండకాయ తిన్న తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు గమనించారు. కాబట్టి మీరు కూడా డయాబెటిస్ సమస్యతో బాధపడుతే ఈ బెండకాయలను తీసుకోవడం చాలా మంచిది.
గమనిక:
బెండకాయ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది, కానీ ఇది డయాబెటిస్ చికిత్స కాదు. డయాబెటిస్ ఉన్నవారు తమ వైద్యుడి సలహా మేరకు మందులు ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలిని పాటించడంల వల్ల డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి