Mango Seed Health Benefits: వేసవికాలంలో చాలామంది మామిడి పండును ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మామిడి పండులో బోలెడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అయితే సాధారణంగా మనం మామిడిపండులోని గింజను పడేసి పండును తింటాము. కానీ మీకు తెలుసా.. మామిడిపండు గింజలో కూడా బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. మామిడిపండు గింజలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ , విటమిన్ , మినరల్స్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మామిడి గింజలు తీసుకోవడంలో కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము.
మామిడి గింజ లాభాలు:
మామిడిపండు గింజలో మాంజిఫెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ మామిడి పండు గింజలను పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మామిడి పండు గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఒమెగా-3 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండు గింజ క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మామిడి గింజలలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా భావించేలా చేస్తుంది, ఇది అతిగా తినడాన్ని నివారించడంలో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ మామిడి పండు గింజ కేవలం ఆరోగ్య లాభాలు మాత్రమే కాకుండా చర్మం సంరక్షణలో కూడా మేలు చేస్తుంది. గింజల నూనె చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీని వల్ల మొటిమలు, తామర వంటి చర్మ పరిస్థితులను చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మామిడి గింజల పొడిని ముఖంపై మచ్చలపై ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల మచ్చలు తగ్గడానికి సహాయపడుతుంది.
మామిడి గింజలను ఎలా ఉపయోగించాలి:
మామిడి గింజలను నీడలో ఎండబెట్టి, పొడి చేసి, పొడిగా నిల్వ చేయవచ్చు. ఈ పొడిని 1-2 టేబుల్ స్పూన్ల మోతాదులో రోజుకు ఒకసారి నీటితో లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. మామిడి గింజలలో వచ్చే నూనెను కూడా తీయవచ్చు. ఈ నూనెను చర్మానికి మాయిశ్చరైజర్‌గా లేదా మొటిమలు, మచ్చలకు ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి