Radiant Skin with Sandal Ubtan: చందనం తరతరాలుగా మన భారతీయ సాంప్రదాయంలో దీని వినియోగం కనిపిస్తుంది. చందనంతో ముఖం కాంతివంతంగా అవుతుంది. ఇందులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. చందనంతో ఉబ్లాన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం
ఉబ్తాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
చందనం పొడి
శనగపిండి
పచ్చిపాలు లేదా రోజు వాటర్
పసుపు
తేనె
నిమ్మరసం
బాదం పొడి
ఉబ్తాన్ తయారీ విధానం..
చందనంపొడి కూడా ఈరోజుల్లో సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతున్నాయి
పేస్టు తయారీ విధానం తెలుసుకుందాం.
ఇదీ చదవండి: కొకనట్ ఆయిల్ VS వర్జిన్ కోకనట్ ఆయిల్ మధ్య తేడా ఏంటి?
ఒక బౌల్ తీసుకుని అందులో చందనం పొడి, శనగపిండి రెండు సమపాళ్లలో తీసుకోవాలి. మీ ముఖానికి, మెడకు గొంతుకు సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.మీకు సహజసిద్ధమైన గ్లో కావాలంటే ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ముఖాన్ని కాంతివంతం చేసే గుణాలుంటాయి.
బాదం పొడి..
బాదం పొడి ఉంటే అదొక స్పూన్ ఇందులో వేసుకోండి ఎందుకంటే బాదం పొడిలో ఎక్స్‌ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ లాభాలు కలుగుతాయి. ఇందులో పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే రోజు వాటర్ యాడ్ చేసుకోవడం బెట్టర్. ఇప్పుడు అన్నిటిని కలిపి మంచి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి రెండు మూడు చుక్కల నిమ్మరసం కూడా వేసుకుంటే చర్మాన్ని కాంతివంతం అవుతుంది.
ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి. కంటికి దగ్గర్లో వేసుకోకూడదు. స్క్రబ్ మాదిరి సర్క్యూలర్ మోషన్ లో రుద్దాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది, హైడ్రేషన్ నిలుపుకోవడానికి చివరగా మాయిశ్చరైసర్ రాసుకోండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: ఎండకాలం మీ ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇదే బెస్ట్ హోం రెమిడీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook