Vitamin E for Hair Growth: విటమిన్ E పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను మన డైట్ లో చేర్చుకుంటే పొడవైన జుట్టు మీసొంతం..

Vitamin E Hair Growth: మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో ఖర్చు పెడతాం. అయితే, అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 24, 2024, 07:43 PM IST
Vitamin E for Hair Growth: విటమిన్ E పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను మన డైట్ లో చేర్చుకుంటే పొడవైన జుట్టు మీసొంతం..

Vitamin E Hair Growth: మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో ఖర్చు పెడతాం. అయితే, అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహారాలు మన డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యంగా పొడవైన జుట్టు మీ సొంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

విటమిన్ ఇ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యం పెరగడానికి సహాయపడతాయి విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహారాలలో జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించాయి. ఇవి హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్నవారికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ ఆహారాల జాబితా ఏంటో తెలుసుకుందాం.

బాదం..
బాదం లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రతిరోజు బాదం రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ రోజంతటికి సరిపోతుంది. దీంతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్..
సన్ఫ్లవర్ సీడ్స్ లో కూడా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మన డైట్ లో చేర్చుకోవడంలో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది న్యాచురల్ గా విటమిన్ ఈ మన చుట్టుకు అందడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 

ఇదీ చదవండి:  ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..

పాలకూర..
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు పాలకూరలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని కూరలాగా, పప్పుల్లో  వివిధ రకాలుగా వండుకొని తీసుకోవచ్చు. పాలకూరను కనీసం వారానికి ఒకసారైనా మన డైట్లో చేర్చుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా బలంగా పొడుగ్గా పెరుగుతుంది.

అవకాడో..
అవకాడో చూడ్డానికి క్రీమ్ మాదిరి ఉంటుంది మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ కి మనం చుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోను సలాడ్స్ శాండ్విచ్ లో తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: మీ ముఖానికి తరచూ బ్లీచ్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు జాగ్రత్త..

హేజల్ నట్‌..
ఇందులో కూడా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది వీటిని మన డైట్ లో చేర్చుకోవచ్చు వీటిని సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఈ పదార్థాలు మన డైట్లో చేర్చుకుంటే నేచురల్‌గా మన జుట్టుకు పోషణ అందుతుంది ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News