Secunderabad Lok Sabha: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వుంది. ఇక్కడ గత కొన్ని లోక్ సభ ఎన్నికల నుంచి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతూ వస్తోంది. 1999లో ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున బండారు దత్తాత్రేయ గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అపుడు కేంద్రంలో బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరింది. ఆ తర్వాత ఒక ఓటు కారణంగా 13 నెలలకే వాజ్‌పేయ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత 1999లో జరిగిన 13వ లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అపుడు అదే స్థానం నుంచి బండారు దత్తాత్రేయ మరోసారి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అపుడు కేంద్రంలో మరోసారి అటల్ బిహారి వాజ్‌పేయ్ ప్రధాన మంత్రిగా ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించారు.
ఆ తర్వాత 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున అంజన్ కుమార్ యాదవ్ వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అప్పడు కేంద్ర ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2014లో మరోసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బండారు దత్తాత్రేయ డ్డి ఎంపీగా గెలిచారు. అపుడు కేంద్రంలో బీజేపీ నేత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్టీయే ప్రభుత్వం కొలువు తీరింది. అపుడు ఆయన మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2019లో మరోసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టాడు. అంతేకాదు రెండోసారి కొలువు తీరిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇక 2024 బీజేపీ తరుపు కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీగా బరిలో దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరుపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు. ఐతే ముగ్గురు బలమైన స్థానిక నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఉప ఎన్నికతో కలిపి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 5 సార్లు భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరేసింది. ఒకసారి మాత్రం తెలంగాణ ప్రజా సమతి పార్టీ ఈ సీటును కైవసం చేసుకుంది. మరి 2024 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఏ పార్టీ గెలుస్తుందనేదనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ ఏర్పడింది.
Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter