Coffee Scrub for Summer Tan: ఎండకాలం మండిపోతున్నాయి. దీంతో ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. ముఖంపై పొడిబారిపోతుంది. ముఖంపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఇంట్లోనే కాఫీ స్క్రబ్‌తో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. కాఫీ పొడితో ముఖంపై ఉన్న ట్యాన్ తొలగించుకోవచ్చు. ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
ఎండకాలం కొన్ని హోం రెమిడీస్ పాటిస్తే పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వీటితో సహజసిద్ధంగా ముఖం మెరిసిపోతుంది. వీటితో ఎంటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా ముఖానికి కాఫీ పొడితో స్క్రబ్ చేస్తే ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగిపోయి, రెట్టింపు కాంతివంతమవుతుంది. అంతేకాదు ఈ ప్యాక్ లో వాడే కలబంద ముఖానికి మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. కీరదోసకాయలో కూలింగ్ గుణాలను కలిగి ఉంటుంది.
కాఫీ, పసుపు స్క్రబ్..
పసుపును పెనంపై వేసి దోరగా వేయించుకోవాలి. దీన్ని కాఫీ స్క్రబ్‌తో కలిపాలి. తగినన్ని నీళ్లు పోసి స్క్రబ్ తయారు చేసుకోవాలి. దీన్ని సున్నితంగా ముఖంపై రుద్దాలి. ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సీరమ్ అప్లై చేసుకోవాలి.
ఇదీ చదవండి: జుట్టును మందంగా మార్చే వంటింటి రెమిడీ.. అస్సలు నమ్మలేరు..
ముల్తానీ మిట్టి, కాఫీ..
ముల్తానీ మిట్టి, కాఫీ స్క్రబ్‌తో తయారుచేసిన ఫేస్ స్క్రబ్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ముఖం యాక్నేకు చెక్ పెడుతుంది. ఒక స్పూన్ కాఫీ పొడి, ముల్తానీ మిట్టిలో పెరుగు కలపాలి. బాగా పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఆరిన తర్వాత ఫేస్‌వాష్ చేసుకోవాలి.
కాఫీ, కలబంద..
కలబంద, కాఫీ పొడి కలిపి జెల్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది చర్మానికి మంచిది. దీంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. ముఖంపై డెడ్ స్కిన్ తొలగించి రక్తప్రసరణను మెరుగుపురుస్తుంది. ముఖానికి మాయిశ్చర్ ఇస్తుంది. ఇందులో కీర దోస కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. ముఖాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయి. ఎండ వల్ల ట్యాన్ అయిన ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: విటమిన్స్ సరైన సమయంలోనే తీసుకుంటున్నారా? ఒక్కసారి నిపుణుల సూచన ఏంటో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook