Vitamin B12 Benefits: శరీరం ఫిట్ అండ్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రధానంగా కావల్సింది విటమిన్ బి12. శరీరానికి ఉపయోగపడే విటమిన్లలో ఇది చాలా ముఖ్యమైంది. శరీర నిర్మాణం, ఎదుగుదల, ఎముకలకు బలం ఇలా విభిన్న ప్రయోజనాలున్నాయి ఈ విటమిన్‌తో. అందుకే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి12 అధికంగా ఉండేట్టు చూసుకోవాలి.
విటమిన్ బి12 లో మిథైల్ కోబాలమిన్, ఎడినోసిల్ కోబాలమిన్ అను రెండు రెండు రకాలుంటాయి. ఈ రెండింటి వల్ల శరీరం వివిధ రకాల వ్యాధుల్నించి సంరక్షింపబడుతుంది. మార్కెట్‌లో ఈ రెండింటి సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ సాధ్యమైనంతవరకూ సహజసిద్ధంగా అంటే ఆహారం ద్వారా సమకూర్చుకోవడం మంచిది. విటమిన్ బి12 అనేది ప్రకృతిలో సహజసిద్దంగా లభించే వివిధ పదార్ధాల్లో పుష్కలంగా ఉంటుంది. మాంసాహారమైతే గుడ్లు, చేపలు, చికెన్, మటన్‌లో ఎక్కువగా లభిస్తుంది. అదే శాకాహరమైతే సోయాబీన్స్, పెరుగు, ఓట్స్, బీట్‌రూట్, పన్నీర్, బ్రోకలీ, మష్రూంలో లభ్యమౌతుంది.
రోజూ కాస్త పనిచేసినా అలసట ఎక్కువగా ఉందంటే విటమిన్ బి12 తక్కువగా ఉందని అర్ధం. విటమిన్ బి12 లోపానికి ఇదొక ఉదాహరణ. విటమిన్ బి12తో శరీరానికి కావల్సిన ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. అందుకే వీక్నెస్, అలసట దూరం చేసేందుకు విటమిన్ బి12 తప్పకుండా అవసరమౌతుంది.
మనిషి ఆరోగ్యం అనేది కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. విటమిన్ బి12 అనేది మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మూడ్ స్వింగ్ లక్షణాలుంటే విటమిన్ బి12 లోపం ఉందని అర్ధం చేసుకోవచ్చు. విటమిన్ బి12 క్రమం తప్పకుండా తీసుకుంటే ఒత్తిడి దూరమౌతుంది.
విటమిన్ బి12 లోపముంటే ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. ఎముకల బలం కోసం అందుకే వైద్యులు విటమిన్ డి, కాల్షియంతో పాటు విటమిన్ బి12 ట్యాబ్లెట్స్ రాస్తుంటారు. ఎముకలకు బలం చేకూరడమే కాకుండా ఆస్టియో పోరోసిస్ ముప్పును కూడా తగ్గిస్తుంది.
Also read: Curry Leaves Jucie: కరివేపాకు నీళ్లతో బోలెడన్ని లాభాలు.. బరువుకి సైతం చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook