/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

RGI Airport Leopard: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చిరుతపులి కలకలం రేపింది. విమానాశ్రయ ప్రహరీ గోడను దూకడంతో అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా పులి ఆనవాళ్లు గుర్తించారు. పాదం గుర్తులు పరిశీలించగా అక్కడకు వచ్చింది చిరుతగా అధికారులు నిర్ధారించారు.

Also Read: KTR AP Elections: ఏపీ ఎన్నికలపై కేటీఆర్‌ జోష్యం.. మళ్లీ ఆయనే గెలవాలంటూ వ్యాఖ్యలు

శంషాబాద్‌ విమానాశ్రయం వేల ఎకరాల్లో ఉంది. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో ఎయిర్‌పోర్ట్‌ కాంపౌండ్‌ నుంచి పులి దూకింది. చిరుతతోపాటు రెండు పులి పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవి దూకడంతో ప్రహరీకి ఉన్న తీగలకు తగిలి అలారం మోగింది. అకస్మాత్తుగా అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.

Also Read: KCR Entry X Insta: కేసీఆర్‌ కొత్త ప్రయాణం.. ఎక్స్‌, ఇన్‌స్టాలోకి ప్రవేశించిన గులాబీ బాస్‌

అనంతరం సీసీ కెమెరాల్లో ఆ ప్రదేశాన్ని చూశారు. అక్కడ పులి సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వెంటనే అటవీ శాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. చిరుత, దాని పిల్లలను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కాగా శంషాబాద్‌ ప్రాంతంలో చిరుత సంచారం వార్తతో సమీప గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. ఇప్పటికే అటవీ జంతువులు గ్రామాల్లో విహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

తాజాగా చిరుత కనిపించడంతో కలకలం ఏర్పడింది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయాందోళన చెందుతున్నారు. చిరుత తప్పిపోయి గ్రామాల్లోకి వస్తే భారీ నష్టం ఉంటుందని భయపడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో చిరుత సంచరిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్‌పోర్టులో కనిపించడంతో గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే పులిని అటవీ శాఖ అధికారులు బంధించాలని శంషాబాద్‌ పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అయితే చిరుత రావడంపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో దాహార్తితో అలమటిస్తున్న జంతవులు జనారణ్యంలోకి రావడం సహజంగా పేర్కొంటున్నారు. నీటి కోసం శంషాబాద్‌ సమీపంలోకి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Leopard And Two Cubs Found At RGIA Shamshabad Airport Viral News Rv
News Source: 
Home Title: 

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి
Caption: 
Shamshabad Airport Leopard (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Sunday, April 28, 2024 - 17:26
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
24
Is Breaking News: 
No
Word Count: 
256