Whatsapp New Feature: ఇక వాట్సప్‌లో మరింత మెరుగైన చాటింగ్, కొత్తగా మరో ఫీచర్

Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ యూజర్లను ఆకర్షించడమే ఇందుకు కారణం. ఇప్పుడు అదే తరహాలో మరో సరికొత్త ఫీచర్ ప్రారంభించనుంది. ఆ ఫీచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2024, 07:01 AM IST
Whatsapp New Feature: ఇక వాట్సప్‌లో మరింత మెరుగైన చాటింగ్, కొత్తగా మరో ఫీచర్

Whatsapp New Feature: వాట్సప్ నుంచి త్వరలో ఫేవరైట్ పేరుతో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. యూజర్లకు మరింత మెరుగైన చాటింగ్ సౌకర్యం అందించేందుకు వాట్సప్ ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. మీ స్మార్ట్‌ఫోన్లపై ఇకపై కొత్తగా మరో ట్యాబ్ కన్పిస్తుంది. వాట్సప్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ చాలా ప్రయోజనాలు అందించనుంది.

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ ఏదని చెబితే నిస్సందేహంగా వాట్సప్ పేరు ప్రస్తావించాల్సిందే. సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ఆదరణ పొందింది వాట్సప్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఈ యాప్ వినియోగిస్తున్నారు. యూజర్లను నిలబెట్టుకోవడమే కాకుండా కొత్త యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పీచర్లు ప్రవేశపెడుతుంటోంది. ఇందులో భాగంగా మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సప్ ప్రస్తుతం కొన్ని ప్రయోగాలు చేస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను ప్రయోగాత్మక దశలో ఉంచింది. ఇందులో భాగంగా నియర్ బై పీపుల్, కాల్ నోటిఫికేషన్, స్టేటస్ నోటిఫికేషన్ వంటి కొత్త ఫీచర్లు అందించింది. ఇప్పుడు ఫేవరైట్స్ పేరుతో మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. 

ఈ ఫేవరైట్స్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెటా అంచనా వేస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో కాంటాక్ట్ జాబితాలో నచ్చిన వ్యక్తితో నేరుగా చాట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.9.23 అప్‌డేటెడ్ వెర్షన్‌తో ఫేవరైట్ ఫీచర్ గురించి తెలిసింది. వాట్సప్ అధికారిక వెబ్‌సైట్ Wabetainfo ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్ షేర్ చేసింది. ఇందులో ఫేవరైట్స్ అనే ట్యాబ్ కొత్తగా చూడవచ్చు. ఇందులో యూజర్లు కాంటాక్ట్ జాబితాలో నచ్చిన వ్యక్తితో చాట్ చేసేందుకు లేదా ఎక్కువగా చాట్ చేసే వ్యక్తుల్ని ఫేవరైట్స్‌లో చేర్చవచ్చు.

అంటే ఇకపై చాట్ చేసేందుకు ప్రతిసారీ కాంటాక్ట్ లిస్ట్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఫేవరైట్స్‌లో యాడ్ చేసుకుంటే నేరుగా ఆ ట్యాబ్ ఓపెన్ చేసి చాట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సప్ యూజర్లకు మరింత మెరుగైన కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సప్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. యూజర్లకు మరింత మెరుగైన చాట్ అనుభూతి కలగనుంది. 

Also read: May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News