Motorola G04 Price: మరీ ఇంత చీపా.. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఐరన్‌ బాక్స్‌ ధరకే కొత్త Motorola G04 పొందండి!

Motorola G04 Price: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. బిగ్ సేవింగ్ సేల్ ప్రారంభం కాకముందే ఈ మోటోరోలా ఇటీవలే లాంచ్ చేసిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 29, 2024, 08:51 PM IST
Motorola G04 Price: మరీ ఇంత చీపా.. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఐరన్‌ బాక్స్‌ ధరకే కొత్త Motorola G04 పొందండి!

Motorola G04 Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో సమ్మర్ బిగ్ సేవింగ్ సేల్ మే రెండవ తేదీన ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన మల్టీ నేషనల్ ఎలక్ట్రిక్ బ్రాండ్లకు సంబంధించిన పరికరాలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ పై అద్భుతమైన ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే వారికి ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. ఈ సమ్మర్ బిగ్ సేవింగ్ సేల్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌పై 50 నుంచి 40 శాతం వరకు కూడా డిస్కౌంట్ లభించనుంది. అలాగే కొన్నింటిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు కూడా ఈ సేల్‌లో అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే సేల్‌కు ముందే మీ ముందుకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కూడిన స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం..

ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ సేల్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజులపాటు టైమ్ ఉంది. అయితే ఇంతలోనే ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా లాంచ్ చేసిన జి04 (Motorola G04) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఈ మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఫ్లిప్కార్ట్ అదనంగా 35 శాతం వరకు తగ్గింపునందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ కలిగిన మొబైల్ MRP ధర రూ.9,999తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 30 నుంచి 35 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ పోను రూ.6,999కే పొందవచ్చు.

అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరో 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునే వారు ముందుగా ఈ మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే 5 శాతం వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

దీంతో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ మొబైల్ రూ.6,490 పొందవచ్చు. దీంతోపాటు ఈ Motorola G04 మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా అతి చౌకగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. దీనికోసం ముందుగా మీరు వినియోగించే పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తే దాని కండిషన్‌ను బట్టి డిస్కౌంట్ అందిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే రూ. 5300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ కొత్త మోటోరోలా జి04 స్మార్ట్ ఫోన్‌ను రూ.500 లోపే పొందవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News