Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటే

Google Pixel 8a Launch: స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్ ఐఫోన్లకు దీటుగా భావించే గూగుల్ పిక్సెల్ నుంచి కొత్త మోడల్ లాంచ్ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కొత్తగా Google Pixel 8a మార్కెట్‌లో రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2024, 10:49 AM IST
Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటే

Google Pixel 8a Launch: ఆపిల్ ఐఫోన్‌లానే గూగుల్ కూడా ఏడాదికో మోడల్ లాంచ్ చేస్తోంది. గత ఏడాది Google Pixel 7a లాంచ్ తరువాత ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8ఎ లాంచ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి డిజైన్, ఫీచర్లు అన్నీ సమూలంగా మారనున్నాయి. Google Pixel 8a లాంచ్ ఎప్పుడో కూడా స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్  Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు. గూగుల్ పిక్సెల్ 8ఎ కర్వ్డ్ డిజైన్‌తో , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో, దీర్ఘకాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తూ సరికొత్త లుక్‌తో అదరగొట్టనుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అదనపు ఫీచర్లు ఉంటాయో వెల్లడైంది. ఈ ఫోన్ 6.1 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇక రిఫ్రెష్ రేట్ 90 కాకుండా 120 హెర్ట్జ్ వరకూ ఉండవచ్చు. 

Google Pixel 8aలో టెన్సార్ జి3 చిప్‌సెట్, మాలి జి 715 గ్రాఫిక్స్ ప్రోసెసర్ ఉంటాయి. ఈ ఫోన్‌లో పిక్సెల్ 7ఎలో ఉన్నట్టే డబుల్ కెమేరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఉంటుంది. గూగుల్‌కు చెందిన అధునాతన ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమేరా కావడంతో ఫోటోలు, వీడియోలు అద్భుతంగా ఉండవచ్చు. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌లో ఉన్న ఏఐ ఫీచర్లు ఉంటాయి. ఇందులో ఆడియో మేజిక్ ఎరేజర్, నైట్ సైట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలు ఫోన్ పనితీరు, అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. స్పష్టమైన ఆడియో క్లారిటీ ఉంటుంది. 

Google Pixel 8aలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎంతకాలం అందుతుందనే వివరాలు ఇంకా తెలియలేదు. ధర కూడా పిక్సెల్ 7ఎ తరహాలోనే ఉండవచ్చని అంచనా. ఏడాది పొడుగు సెక్యూరిటీ అప్‌డేట్ లభిస్తుంది. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండటంతో ఫోన్ పనితీరే విభిన్నంగా ఉంటుంది. కెమేరా 64 మెగాపిక్సెల్ అయినా అంతకు మించిన రిజల్యూషన్‌తో ఫోటోలు తీయవచ్చు. ఇక వీడియో క్లారిటీ ఇతర ఫోన్ల కంటే భిన్నంగా మెరుగ్గా ఉంటుంది. 

Google Pixel 8a ధర ఎంత ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఫీచర్లు, కెమేరా పరంగా చూస్తే ధర కాస్త అటూ ఇటూ ఉన్నా నిస్సందేహంగా తీసుకోవచ్చనేది నిపుణుల సూచనగా ఉంది. 

Also read: Summer Weather Report: వందేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు, ఏపీలో రెడ్ అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News