Jio Cinema: రోజుకు 1 రూపాయితో జియో సినిమా ప్రీమియం సభ్యత్వం, 12 ఓటీటీలతో జియో ప్లాన్స్

Jio Cinema: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలీకం సంస్థ రిలయన్స్ జియో నుంచి ఉచితంగా అందుతున్న జియో సినిమా ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందింది. క్రికెట్ మ్యాచ్‌ల ఫ్రీ స్ట్రీమింగ్‌తో క్రేజ్ పెంచుకుంది. ఇప్పుడిదే జియో సినిమా  ప్రీమియం ధరల్ని కూడా భారీగా తగ్గించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2024, 10:37 AM IST
Jio Cinema: రోజుకు 1 రూపాయితో జియో సినిమా ప్రీమియం సభ్యత్వం, 12 ఓటీటీలతో జియో ప్లాన్స్

Jio Cinema: రిలయన్స్ జియోకు చెందిన జియో సినిమా ఓటీటీగా ఆదరణ పెంచుకుంటోంది. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అదే సమయంలో జియో నెట్‌వర్క్ యూజర్లకు జియో సినిమా ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తోంది. అయితే ఇందులోనే జియో సినిమా ప్రీమియం కూడా ఉంది. దీనికి మాత్రం ధర చెల్లించాల్సిందే.

కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు జియో సినిమా ప్రీమియం ధరను రిలయన్స్ జియో భారీగా తగ్గించేసింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాన్స్, డిస్కౌంట్లు అందించే రిలయన్స్ సంస్థ జియో సినిమా ప్రీమియం ఓటీటీ సభ్యత్వాన్ని నెలకు కేవలం 29 రూపాయలే అందించనుంది. నెలకు 29 రూపాయల్లో జియో సినిమా ప్రీమియం సభ్యత్వం అంటే మార్కెట్‌లో ఉన్న ఏ ఇతర ఓటీటీతో పోల్చుకున్నా చాలా చాలా తక్కువ. రోజుకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అటు క్రికెట్ మ్యాచ్‌లు, ఇటు ఇంటర్నేషనల్ షోలు, సినిమాలు చూడవచ్చు. 

జియో ప్రస్తుతం 4 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్  రీఛార్జ్ చేస్తే జియో సినిమా ప్రీమియంతో పాటు ఇతర ఓటీటీ సేవలు లభిస్తాయి. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేస్తే జియో యూజర్లకు ఓ కూపన్ లభిస్తుంది. దీంతో జియో సినిమా ప్రీమియం ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు. జియో టీవీ 148 రూపాయల ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్, జీ5, సన్‌నెక్స్ట్, డిస్కవరీ ప్లస్ సహా 12 ఓటీటీ సేవలు లబిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. 

జియో 389 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా జియో సినిమా ప్రీమియం, సోనీలివ్, జీ5, సన్‌నెక్స్ట్, డిస్కవరీ ప్లస్ వంటి 12 ఓటీటీ సభ్యత్వాలు ఉచితంగా పొందవచ్చు.

జియో 1198 రూపాయల ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో సినిమా ప్రీమియం, సోనీలివ్, సన్‌నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా 14 ఓటీటీలు ఉచితంగా పొందవచ్చు.

ఇక జియో 4498 రూపాయల ప్లాన్ ఒక ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో కూడా జియో సినిమా ప్రీమియం, సోనీలివ్, జీ5, సన్‌నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి. 

Also read: FD vs NSC Benefits: ఎఫ్‌డి , ఎన్‌ఎస్‌సిల్లో 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ఎందులో ఎక్కువ లాభాలొస్తాయి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News