IPL LSG vs KKR Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్ మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న లక్నో సూపర్ జియాంట్స్ ఘోర పరాభవం తప్పలేదు. 98 పరుగుల తేడాతో లక్నోపై కోల్‌కత్తా భారీ విజయం సొంతం చేసుకుంది. భారీ స్కోర్ ఛేదనలో లక్నో తడబడి ఐదోస్థానానికి చేరుకుంది.
Also Read: PBKS vs CSK Highlights: చెన్నైకి భారీ విజయం.. ఏడో ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు
మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్ విధ్వంసంతో 81 పరుగులు సాధించాడు. 39 బంతుల్లో 81 చేసి (6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడు. ఫిల్ సాల్ట్ (32), రఘువంశీ (32), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (23) మోస్తారు స్కోర్ చేశారు. రింకూ సింగ్ (16), ఆండ్రి రసెల్ (12), రమణ్‌దీప్ సింగ్ (25) కొంత పరుగులు చేసి భారీ స్కోర్‌గా మలిచారు. లక్నో బౌలర్లు పరుగులు నియంత్రించలేకపోయారు. నవీన్‌ఉల్ హక్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధువీర్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: India T20 World Cup Squad 2024: రోహిత్ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు.. రాహుల్‌కు షాక్
భారీ స్కోర్ ఛేదన కోసం దిగిన లక్నోకు ఆరంభం పర్వాలేదనిపించగా.. మిడిలార్డర్ కుప్పకూలింది. అత్యధిక పరుగులు సాధించడంలో బ్యాటర్లంతా విఫలమవడంతో 16.1 ఓవర్లలో 137 పరుగులు చేసి కుప్పకూలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (25) బ్యాటింగ్ ఝుళిపించకలేకపోయాడు. అర్షిన్ కుల్కర్ణి (9) పరుగులే చేయగా.. మార్కస్ స్టోయినీస్ (36) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (5), నికోలస్ పూరన్ (10), ఆయూష్ బదౌన్ (15), అష్టన్ టర్నర్ (16), కృనాల్ పాండ్యా (5), యుధీవర్ సింగ్ (7), రవి బిష్ణోయ్ (2) ఎవరూ మోస్తరు స్కోర్ కూడా సాధించలేకపోయారు.
భారీ పరుగులు సాధించిన కోల్‌కత్తా బౌలింగ్‌లోనూ తిరుగులేదని నిరూపించింది. పవర్ ప్లేలో కొంత తడబడినా ఆ తర్వాత విజృంభించి లక్నోను చాప చుట్టేసింది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్ల చొప్పున విరుచుకుపడడంతో.. అండ్రె రసెల్ రెండు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీసి జట్టుకు భారీ విజయాన్ని అందించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 8వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్‌కత్తా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ విజయంతో కోల్‌కత్తా దాదాపుగా ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇక ఐదో ఓటమితో లక్నో ఐదో స్థానానికి దిగజారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter